ఏరోజు కారోజు
ప్రభాతం.......
అరుణ కాంతుల వికాస విలాసాన్ని
తన చిరునామాగా విసరుతుంది....
ఆ నిత్య చైతన్యోదయ హృదయకాంతులెన్నెన్నో....
ఈరోజు విలాసం రేపటికుండదు
రేపటి రంగుల హేల ఆపైరోజు వుండదు
అంతా వైవిధ్యమే
అంతా మార్పే
అన్నిటా విన్యాసమే
మార్పు కూర్చుకొన్న
హృదయావిష్కరణమే
వసంతం చెట్లపై ఆశలు చిగుర్లు తొడుక్కుంటున్నట్లు.....
పూల తావితో ఆడుకుంటున్నట్లు.....
అదేదో కాదు......
నీ స్వాంతమే
మార్పును ఆశించే
ప్రతి జీవి ముంగిటా విరిసే
నిత్య వాసంత విన్యాసమే!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)