అమ్మా నాన్నలను మీ దగ్గర ఉంచుకోలేకపోతున్నారా?
ఐతే, మీకన్నా అనాధలు లేరు.
అమ్మానాన్నలతో ఆప్యాయంగా మాట్లాడలేకపోతున్నారా?
ఐతే,మీకన్నా అభాగ్యులు లేరు.
అమ్మానాన్నల ఆలనాపాలనా చుడలేకున్నారా?
ఐతే,మీకన్నా అధములు లేరు.
అమ్మానాన్నల ఆశీస్సులను కోరుకోలేకపోతున్నారా?
ఐతే, మీకన్నా దురదృష్టవంతులు లేరు.
అన్నదములతో మీరు కలిసుండలేకపోతున్నారా?
ఐతే,మీకన్నా అల్పులు లేరు.
అక్కచెల్లెళ్ళను అభిమానించలేకపోతున్నారా?
ఐతే,మీకన్నా అయోగ్యులు లేరు.
చుట్టాలతో చెలిమి చేయలేకపోతున్నారా?
ఐతే,మీకన్నా చెడిపోయేవారు లేరు.
ధర్మాన్ననుసరించి ధరలో మసలలేకున్నారా?
ఐతే, మీకన్నా దరిద్రులు లేరు.
బుద్బుదప్రాయమీ జీవితమని తెలియకుండానే గడుపుతున్నారా?
ఐతే,మీకన్నా అజ్ఞానులు లేరు.
ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోలేక పోతున్నారా?
ఐతే,మీకన్నా అంధులు లేరు.
కర్తవ్యాన్ని ఆచరించ లేకపోతున్నారా?
ఐతే,మీకన్నా బద్ధకిస్టులు లేరు.
నిజాయితీగా బ్రతకలేకపోతున్నారా?
ఐతే,మీకన్నా నికృష్టులు లేరు.
మాయకు,మహిమకు తేడా తెలియలేకున్నారా?
ఐతే,మీకన్నా మూర్ఖులు లేరు.
భక్తికి జ్ఞానంకూడా తోడవుతేతప్ప లాభంలేదని
తెలుసుకోలేకపోతున్నారా?
ఐతే,మీకన్నా భ్రమలో వేరెవరూ లేరు.
అంతటా ఉంటాడు దేవుడని తెలుసుకోలేకున్నారా?
ఐతే,మీ అంతట అజ్ఞాని లేరు
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)