అ ఆలు చదువుదమా
అందరు కలిసి ఆడుదమా!
ఇ ఈ లు దిద్దుదమా!
ఇంపుగ అందరము పాడుదమా!
దారంతా మనదే అందామా!
ఎ ఏ ఐ చెప్పుదమా!
ఏదైనా పాడుదమా!
ఒ ఓ ఔలు నేర్చుదమా!
పంతులకు మొక్కుదమా!
అం అః లు దిద్దుదమా!
అమ్మ నాన్నలకు దండాలూ!
అందరు కలిసి హాయిగ
చదువుదమా!