ఈ పడవ నాదనుకున్నాను,
నేనే దీన్నినడుపుతున్నాననీ అనుకున్నాను.
నా భారం పడవ మోస్తోందని,
దాన్ని నడిపేబాధ్యత నాదని అనుకునాను.
గమ్యం నాఇష్టమని ,గమనం నాసొంతమని
అనుకున్నాను.
హటాత్తుగా వచ్చిన తుఫాను,
ఇవేవీ నిజంకావని తెలిపింది.
అందులో పడవ కొట్టుకొనిపోతున్నప్పుడు,
నాచేతిలో,చేతల్లో ఏమీలేదని తెలిసింది.
కనులుతెరిచి చూసేసరికి,
నీ కరుణతోతడిపి,
నన్నునీ ఒడిలోకితీసుకున్నావని తెలిసింది.
అప్పుడే అసలువిషయం అర్ధమైంది,
పడవ నీదేనని,దాన్ని నడిపేవాడివీ నీవేనని,
నీ ఒడిలోనే నన్ను ఉంచుకున్నావని.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)