అందరికీ నమస్కారం,
వేసవి సెలవుల తరువాత నేను ఎంతో హుషారుగా స్కూల్ కి వెళ్లాను. మా సోషల్ స్టడీస్ టీచర్ కరెంటు ఈవెంట్స్ మీద ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అని చెప్పింది. నేను పది న్యూస్ పేపర్లు, సుమారు ఒక నెలరోజుల పాటు చదివాను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.! ఏ పేపరు చూసినా, దాదాపు ప్రతి రోజు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట వందల సంఖ్యలో మారణహోమం జరుగుతోంది. దేవుడు గురించి , మతం గురించి కొట్టుకుంటున్నారు. ఎంత దారుణం !!!
నాకు అర్ధం కాలేదు. నాన్నని అడిగాను, ఇది ఏమిటి? ఎందుకు అని?. నాన్న, నాకు అనేక మతాల గురించి, వారి వారి నమ్మకాల గురించి వివరిoచారు. నాకు ఇందరు దేవుళ్ళు, ఇన్ని మతాలు ఎందుకున్నాయో అర్ధం కాలేదు. మానవులు మతం పేరిట, శతాబ్దాలుగా యుద్దాలు చేస్తున్నారని తెలుసుకొని చాలా బాధ అనిపించింది. బాగా ఆలోచించాను ఈ సమస్యకు ఏమిటి పరిష్కారం అని? తోచలేదు. నాన్న కూడా చెప్పలేక పోయారు.
కానీ నాకు ఇప్పుడని పిస్తోంది , దేవుడు నాకు గాని సూపర్ పవర్ ఇస్తే , నేను ఆ శక్తి తొ “జీసస్, అల్లా, కృష్ణుడు, రాముడు, శివుడు, ఇంకా అన్నిదేవుళ్ళ ను కలిపేసి ఒకే దేవుడిగా మార్చేస్త” అప్పుడు ఇన్ని మతాలు, ఈ మారణహోమాలు వుండవు.
దేవుడు నాకు ఏకీకరణ శక్తి ఇస్తే ఆదేవుడినే మర్చి ఒక్కడిగా చేస్తా . భగవంతుడా నాకు ఆ ఏకీకరణ శక్తిని ఇవ్వు. విశ్వశాoతికి సహకరించు.