రంగులకు రాగాలుండవు
హంగులకు ఆత్మలుండవు
భంగిమలు ఎన్ని ప్రదర్శించినా
పొంగిపోయే హృదయం లేకుంటే
వేషానికి సార్థకత లేదు
ఆహార్యాలు అసలు రూపాన్ని తెలుపడానికే
ఆనందాలు ఆత్మలను కలపడానికే
ప్రపంచ రంగస్థలం మీద
ఆడని నటీనట జీవాలు లేవు
అనుభవంలోకి రాని భావాలు లేవు
అంతా నాటకమే
అంతా బూటకమే
అంతిమంగా తేలేది ఒక్కటే
'అంతర్లీనం'
అదే అన్నింటికీ పరమావధి !
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)