ఇక్కడ నీడ పట్టున విశ్రమిస్తున్న నేను
అక్కడ మండుటెండలో శ్రమిస్తున్న నీవు
ఇక్కడ మనిషి బొమ్మలకు అభిషేకాలతో పాలను వృధా చేస్తున్న నేను
అక్కడ కన్న బిడ్డకి గుక్కెడు పాలు దొరకక విలపిస్తున్న నీవు
ఇక్కడ పంచభక్ష్యాలు ఆరగిస్తున్న నేను
అక్కడ పట్టెడన్నం కోసం పరితపిస్తున్న నీవు
ఇక్కడ దైనందిన విలాసాల కోసం ధనం వెదజల్లుతున్న నేను
అక్కడ దినం గడవడం కోసం పైసలు వెతుకుతున్న నీవు
ఇక్కడ పట్టు పానుపుపై ఆదమరచి నిద్రిస్తున్న నేను
అక్కడ కటిక నేలపై కునుకుతీయ యత్నిస్తున్న నీవు
ఇక్కడ రాజరికంలో తుల తూగుతున్న నేను
అక్కడ పేదరికంలో మగ్గుతున్న నీవు
ఈ తారతమ్యం సమసిపోయేదెప్పుడు?
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)