కవితా స్రవంతి
రామినేని రంగారావు కవితలు
- రామినేని రంగారావు

క. డబ్బును గుంజుట కొరకే
ఉబ్బుగ నీవైద్యురాలు ఊరకె అనెనా?
అబ్బ! యిదెక్కడి కర్జము
నిబ్బరముగ విధిని నమ్మి నిల్చుట మేలా?. 6

క.శస్త్రచికిత్సను కాదని
అస్త్రంబుల నుంచి లాగ అదియెట్లగునో?
విస్తృతముగ తలపంగను
శాస్త్రీయం బేది అగునొ?సమ్మతి తెలుపన్ 7

సీ. మత్తువైద్యుడు లేక మాబిడ్డ కేరీతి
మత్తు నిచ్చెదరయ్య?మాన్యులార!
స్వాధ్యాయముల కంటె స్వానుభవమ్ముతో
ఓర్పుతో మత్తిచ్చు నేర్పు కలదు
శస్త్రనైపుణికుడు సక్కి లేకుండగా
ఆపరేషను చేయ అర్హులొక్కొ?
నాల్గు దశాబ్దాల నైపుణ్యమున్నది
జట్టువారలు జగజ్జెట్టులయ్య
ఆ.వైద్యపరికరాలు వసతులు ఉన్నవా?
అన్నిఉన్నవయ్య-ఆర్యులార
లేనిదొకటె మీకు నిబ్బర మీనాడు
అన్ని తెలిసి యిట్టు లడుగ తగునె! 8

క.వచ్చెడు కానుపు లూపుతొ
నచ్చిన సమయంబునందు నచ్చిన వేళన్
ఇచ్ఛావృత్తిని మెలగిన
ఖచ్చితముగ కోరునపుడె కనగా వచ్చున్ 9

క.మగబిడ్డ కలిగె నేనియు
తగునిప్పుడె పిల్లలాప తగు విధమేదో
మగువకు త్రిప్పుడు ప్రేగును
అగణితముగ మీకు చెప్ప నర్హత కలదే 10

ఆ.పురుష శిశువు పుట్ట పున్నామ నరకంబు
తప్పు నేమొ-లేదొ- తపనతోడ
తల్లిదండ్రి విడిచి తన భార్యతో నేగు
ఆడబిడ్డ కనగ అన్న మిడును 11

తే.ఏది తగినదొ మీజట్టు ఎన్నుకొనుడు
తల్లి-బిడ్డల శ్రేయంబు తలను దాల్చి
శ్రేష్ట మార్గాన మము దరి చేర్చుడయ్య
పూని మాబాధ తీర్చుడు పుణ్యులార! 12

ఆ.హస్తవాసి చూసి అనుభవంబును కాంచి
సాటి వారి లోన మేటి వనుచు
బిడ్డచేత నిడగ-బిడ్డతో-తల్లిని
సేమమార మాకు చేర్చిరయ్య 13

ఆ.బాధలోన మేము పలుభంగు లంటిమి
మనసు పెట్టవలదు-మాదు పలుకు
ఆదరమున మీది అందెవేసిన చేయి
వందనములు మీకు నందుకొనుడు! 14


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)