కవితా స్రవంతి - నటేశ్వరం
అమరౌక సౌందర్యం
- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ,

అమరుల ఓకము కావున
విమలమునై కానబడును విహరించు నెడన్
సమమగు చూపుల నెల్లరి
గమనించుట కానబడును గాదె మనుజులన్ !

ఎన్నెన్ని యందములకో
వన్నెలు దిద్దించు ప్రకృతి పలు తావులలో
వెన్నెల వలె మదిని దోచి
విన్నాణమునందజేసి విలువల నింపున్ !

గిరులును ఝరులును తరువులు
పరిమళముల నింపు పుష్పవనములు గృహముల్
పరికింపగ గలవెన్నో
సురుచిరమౌ దేశమందు చూడగ వెడలన్ !

సుజనుల రంజన జేసెడి
నిజసేవాసంస్థలిచట నిలిచినవెన్నో
ప్రజలకు తెలుగును పంచుచు
విజయోత్సవములను జరిపి వెలుగుల గాంచున్ !

ప్రేరణజేయును కవులకు
పూరించును కళల దీప్తి భువనము నిండన్
కారణ మాయెను ప్రగతికి
తోరణమై విజయములకు దోహదమొసగున్ !

నేనిట అల్లిన కావ్యము
వేనోళ్ళ సుశంసలంది వెలిగె జగతిలో
కాన నుతించెద నీ ధర
నూనముగా స్వర్గమనుట నూత్నత నింపున్!


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)