కవితా స్రవంతి
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా!
- శ్రీ చాకలకొండ రమాకాంతరావు

పల్లవి. అబల కాదు సబల, నేటి మహిళ,
ప్రబల, ఙ్ఞాన జ్యోత, ప్రకటిత విజ్వల. ||అబల||

అనుపల్లవి. అమ్మగ, భార్యగ, అక్కగ, పుత్రిగ,
కమ్మని ప్రేమిచ్చు అమృత,మహిళ. ||అబల||

1. సహన, శాంతి, ప్రేమ నందించు వెలుగులా,
స్నేహ, సౌమ్యత జూపు, సౌందర్య లహరిలా,
దేహబాధలు తీర్చు దివ్య దేవతలా,
మహనీయ మూర్తిలా, వెలగెడి మహిళ. ||అబల||

2. ధూర్తులను శిక్షించు - రుద్రమ దేవిలా,
వైరుల పాలిటి కాళిక- ఝాన్సిలా,
కారుణ్య సాగరిలా, కమ్మని కవితలా,
శారద మాతలా, శోభించు మహిళ. ||అబల||

3. అటలలో, పాటలలో, ఆణిముత్యములా,
పట్టుదల, కౌశలము, పాటవపు దీప్తిలా,
కూడు, గుడ్డ గూర్చు అన్నపూర్ణమ్మలా,
సాటి లేని ప్రతిభ చూపించు మహిళ. ||అబల||

4. వైద్య, విఙ్ఞాన, వ్యాపార, విద్యలలో,
అధికార, సాహిత్య, సంగీత శాస్త్రముల,
పదవి బాధ్యత లతో, ప్రపుల్ల ప్రభల,
మేదిన మేటిగ వెలగెడి మహిళ! ||అబల||


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)