కవితా స్రవంతి
వృక్షో రక్షతి రక్షిత
- శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

అబ్బబ్బా ఎండలు, ఎండలు... మండించే ఎండలు ఎండలు...
ఒడలంతా మంటలు మంటలు... జనమంతా హాహాకారాలు!
సహనం కోల్పోయి భాస్కరుడు కోపాన్ని నిప్పులుగా కురిపిస్తూ...
నిస్సహాయంగా అనిలుడు తాను సైతం అగ్ని సెగలను వీస్తూ...

అవగతమౌతోంది గ్రీష్మమంటే ఏమిటో, అర్థమౌతోంది దాహమంటే తీరనిదని
విద్యుత్ కోతతో అగచాట్లు... వడగాడ్పుకు వడలే దేహాలు...
భవంతులలోని సమశీతోష్ణ గదులలోనే మనకింత యాతన!
కూడు లేని, గూడు లేని నిరుపేదల జీవికలో ఎంత దైన్యం? మరెంత కష్టం??

ఆకాశ హర్మ్యాల కోసం, వెడల్పు బాటలకోసం
చెట్లు వేళ్ళతో సహా నరికిన పాపమే మననిలా కాల్చివేస్తోందని,
మొక్కలు నాటని దోషమే ఇలా శిక్షిస్తోందని తెలుసా?
ఇదంతా మన స్వయంకృతమే కదా నేస్తం?

ఇకనైనా చేయి చాచి చేయి ప్రతిన! 'ఇప్పటినుంచి మొక్కలు పెంచుతాను
ప్లాస్టిక్ వాడకాన్ని వదిలేస్తాను... సూరీడా చల్లబడు, మేఘుడా నీటిని విడు!’
ప్రకృతి పులకిస్తోంది చూడు, ఉత్తరాన నీలి మబ్బు నీడ జాడలు...
భానుడు చల్లని చందురుడైనాడు... వనాన్ని కాపాడు - అక్కున చేర్చుకోదూ నిన్ను?


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)