మా వూరి గ్రంథాలయం మూయబడుతు, మళ్లీ తెరవబడుతూ కొన ఊపిరిరో కొట్టుమిట్టాడుతుంటే, అమెరికాలో లైబ్రరీలు మాత్రం ప్రభుత్వ, ప్రజల సహాయంతో, ప్రోత్సహంతో కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సంచిక
ముఖచిత్రంపై ఉన్న ఫోటోలు ప్రస్తుతం నేను ఉంటున్న ఊరు లైబ్రరీ లోనివి. ఈ వూరి జనాభా 70 వేలు మాత్రమే.
బడి అయిపోగానే పిల్లలు ఇక్కడకు రావచ్చు. హోం వర్కు చేసుకోటానికి సహాయం అందుతుంది. చదువుకోటానికి ప్రత్యేకంగా గదులుంటాయి. వేసవి సెలవుల్లో పుస్తక పఠనం, చిత్రలేఖనం, కథలు చెప్పటం, కవిత్వ రచన పోటీలు ఉంటాయి. ఇవన్నీ లేకుంటే పిల్లల్లో పఠనాసక్తి తగ్గి తిరిగి బళ్ళు ప్రారంభమయ్యాకా చదువుల్లో వెనుకంజ వేస్తారని నిపుణుల ఆబిప్రాయం. ఇంగ్లీషు మాతృభాష కానివారు ఇంగ్లీషు
మాట్లాడంలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ క్లాసులు కూడా ఉంటాయి. సభ్య్తత్వం మొదలు అన్ని సౌకర్యాలు ఉచితమే.
అమెరికాలో గ్రంథాలయాలను దేవాలయాలుగా పరిగణిస్తుంటే మరి భారతదేశం సంగతి? నాకు తెలిసినంత వరకు అవి మూతబడుతున్నాయి లేదా సరైన పోషణ లేక వెలవెలబోతున్నాయి. తరగతి పుస్తకాల్లో రాసింది చదివి, మార్కులు, ర్యాంకులు కొట్టేయటమే విజ్ఞామనుకుంటే మనం పెద్దతప్పు చేస్తున్నట్టే. ప్రతి ఊళ్లో, పట్టణంలో గుళ్లతో బాటూ గ్రంథాలయాలు వెల్లివిరుస్తాయని ఆశిద్దాం.