శీర్షికలు - సంగీతరంజని
ఎన్నగా మనసుకు రాని - నీలాంబరి - త్యాగయ్య
- సేకరణ: డా. కోదాటి సాంబయ్య

నీలాంబరి జోల పాటలకూ, ఉయ్యాల పాటలకూ ప్రసిద్ధి చెందిన రాగం. శాంతము, మత్తు గొలిపే రాగం. ఈ రాగం వింటుంటే మన మనస్సులో పవిత్రత కలుగుతుంది.

షడ్జమం-చ. రిషభం-అం. గాంధారం-శుద్ధ మధ్యమం-పంచమం-చ.దైవతం- కా.నిషాదం.

ప ద నీ దా ప మ గ --ప్రయోగం లో కైశికి నిషాదం వస్తుంది. నీలాంబరి నీలాకాశం, లేదా నీలి రంగు వస్త్రం.

ఈ రాగంలో తరచుగా వినబడే రచనలు:

1. ఎన్నగా మనసుకు- త్యాగయ్య.

2. ఉయ్యాల లూగావయ్యా

3.లాలి యూగవే

4. అంబా నీలయతాక్షి -- ముత్తుస్వామి దీక్షితులు.

5. బ్రోవవమ్మా - శ్యామశాస్త్రి .

6. తుగిదలే -- పురందర దాసు.

7. అంబా నీలాంబరి --తంజావూరు పొన్నయ్య పిళ్ళై .

8. మాధవ మామవ -- నారాయణ తీర్థులు.

9. మణి నూపుర ధారి -- ఊతుక్కోడు వేంకట సుబ్బయ్యర్.

10. శృంగార లహరి - లింగరాజ అరసు.

త్యాగయ్యపై పోతన కవిత్వ ప్రభావం చాలా ఉంది. చిన్నప్పుడు వారి తల్లి సీతమ్మ పాడిన భాగవత పద్యాలు, తండ్రి కాకర్ల రామబ్రహ్మంతో హరికథలకు వెళ్లి విన్న భాగవత ఘట్టాలు, వారి రచనల్లో తరచూ వస్తాయి. ఎన్నగా మనసుకు రాని కృతికి పోతన ' కమలాక్షు నర్చించు ...' పద్యం స్పూర్తి అని నా భావన.

సీ: కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీ నాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేష సాయికి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు , మధువైరి దవిలిన మనం మనము
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

పల్లవి:
ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్నులేలే కన్నేమిన్న లేలే

అనుపల్లవి:
మోహముతో నీల వారి వాహ కంటిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహ మేలే ఈ గేహ మేలే

చరణం: 1
సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే బూజించని కరము లేలే ఈ కాపురము లేలే

చరణం: 2
మాలిమితో త్యాగరాజు నేలిన రామమూర్తిని
లాలించి పొగడని నాలికేలే సూత్ర మాలి కేలే.

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)