కోశాధికారి రవీంద్ర కూచిభొట్ల నేతృత్వంలో, సాయి కందుల నిర్మాణ సారధ్యంలో దేవాలయ ప్రాంగణాన్ని మరపించే స్థాయిలో నిర్మించిన సభావేదికపై ఉదయం 8 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏకధాటిన సాగిన పిల్లల సంగీత పోటీల్లొ నూటికి పైగా ఆరు నుండి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు పాల్గొని ఆష్టొత్తర కీర్తనలను ఆలాపించారు. భావము, రాగము, లయ, శృతి, ఆలాపన మొదలైన ఆంశాలపై పరీక్షింపబడిన పిల్లలు ఈ పోటీకై ప్రత్యేకంగా శిక్షణ పొందినట్టు కార్యక్రమ సారధులు శీలా సర్వ, సదా మల్లాది, వాణీ గుండ్లవల్లి చెప్పారు. సముద్రానికి ఆవలనున్నను పిల్లలు భావశుద్ధి, గాత్రశుద్ధి పుష్కలంగా ఉండి పట్టుదలతో కృషి చేసినట్టు తెలుస్తుందని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఆవ్వారి గాయత్రి, గాయత్రి సత్య, నేమాని సోమయాజులు, రేవతి సుబ్రహ్మణ్యం, సౌమ్యా సుబ్రహ్మణ్యం న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
సాయంత్రం అయిదు గంటలనుండి ప్రారంభమైన ఆరాధనోత్సవానికి ముఖ్య అతిధిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ పాల్గొని ప్రపంచంలోని ప్రతి దేశంలో సిలికానాంధ్ర పేరు వినపడుతోందని అన్నారు. రమణ గారిని సిలికాంధ్ర వైస్ చైర్మన్ రాజు చామర్తి సత్కరించారు. మరొక అతిధి, టెక్ మహీంద్ర సంస్థ అధికారి ఏ.యస్.ప్రసాద్ భాగవతంలోని పద్యాలను వల్లేవేస్తూ తనకు తెలుగుపై మరియు సిలికానాంధ్ర సంస్థతో ఉన్న అనుబంధాన్ని పంచుకొన్నారు. ఆటు పిమ్మట జరిన కార్యక్రమంలో జ్యోతి లక్కరాజు కులుకగ నడవరొ కొమ్మలారా, పలుకు తేనెల తల్లి, నారయణతే నమో నమో మొదలైన కీర్తనలకు కన్నుపండుగగా కూచిపూడి నాట్యం చేసారు. జ్యోతి గారిని సిలికానాంధ వైస్ చైర్మన్ దిలీప్ కొండిపర్తి సత్కరించారు. చివరిగా మకుటాయామానంగా నిలిచిన అన్నమాచార్య సంకీర్తనార్చనలొ కర్ణాటక సంగీతంలో పేరొందిన హైద్రాబాద్ బ్రదర్సు లో ఒకరైన కళారత్న దారూరి శేషాచారి పూర్తిస్థాయి సంగీత కచ్చేరీ నిర్వహించి గానామృతంతో ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసారు. రెండుగంటల పాటు జరిగిన కచ్చేరీలో అరుదైన అన్నమయ్య సంకీర్తనలతో రాగాలాపన, నెరవెల్, తనియావర్తనం మొదలైన ఆంశాలతో తోడి, షణ్ముఖప్రియ, హరికాంభోజీ మొదలైన రాగాలతో కీర్తనలు ఆలాపించి సభికుల్ని కట్టి పడేసారు. ఉదయపు పోటీల్లొ గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేసి సంగీతంలో ఇంకా పేరొందాలని ఆశీర్వదించారు. అనూరాధ శ్రీధర్ వయోలిన్, శ్రీరాం బ్రహ్మానందం మృదంగం సహకారం అందించారు.
దేవాలయ మంటపాన్ని తలపించే వేదిక |
అలంకరణలతో సభా ద్వారం |
పిల్లల సంగీత పోటీలు |
ముఖ్య అతిధి NV రమణ (జస్టిస్ సుప్రీంకోర్టు) జ్యోతి ప్రజ్వలన |
పిల్లలే వ్యాఖ్యాతలు |
జ్యోతి చింతలపూడి అభినయం |
హైద్రాబాద్ బ్రదర్స్ దారూరి శేషాచారి కచ్చేరీ |
ప్రేక్షకులతో నిండిన సభ |