మే 30 మూడవ రోజున 8 గటలకు వైభవంగా రథయాత్ర జరిగింది. పూలమాలతో అలంకరించిన రథంపై శ్రీదేవీ, భూదేవీ సమేతుడైన వేంకటేశ్వర ఉత్సవ విగ్రహాల్ని పిల్లలు పెద్దలు అన్నమాచార్య సంకీర్తనలతో ఊరేగించారు. నిలువెత్తు అన్నమయ్య చిత్రపటాలను చేత పట్టుకొని సన్నీవేల్ నగరంలో మైలు దూరం నగర సంకీర్తన చేసారు. పిమ్మట, దేవాలయ సమావేశమందిరంలో వేయి గొంతుకలతో సప్తగిరి సంకీర్తనలను శ్రవణానందకరంగా పాడుతూ 'సహస్ర గళార్చన ' చేసారు. చెరుకుపల్లి శ్రీనివాస్ బృందం వీణావాదన, దివ్య సంగీత కళాశాల బృంద గీతాలు, నాదనిధి స్కూలు వారి అన్నమయ్య సంకీర్తనల ఆలాపనతో మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్సవం ముగిసింది.
నగరసంకీర్తన - రథోత్సవం |
సప్తగిరి సంకీర్తన |
చెరుకుపల్లి శ్రీనివాస్ బృందం - వీణావాదన |
కార్యక్రమ నిర్వాహకుల ఆనందోత్సహం |