సుజననీయం
కూచిపూడికి పట్టం
- తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదకవర్గం:
|
పదేళ్లుగా సిలికానాంధ్రకు, కూచిపూడి నాట్యకళకు ఉన్న అనుబంధం అందరికి సుపరిచితమే. అయిదు తరాల నాట్యకళాకారులను అమెరికాలో ఒకే వేదికపైకి తెచ్చి శిష్యబృందంతో గురుపరంపరను ఘనంగా సత్కరించింది కూడా. గత డిసెంబర్ లో జరిగిన నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్యసమ్మేళన వేదికపై శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 'కూచిపూడి నాట్యారామం' నిర్మాణ నిర్వహణ బాధ్త్యతలను సిలికానాంధ్రకు అప్పగించిన విషయం మనకు విదితమే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఫిబ్రవరి 26న సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు చైర్మన్, కూచిభొట్ల ఆనంద్ గారు కూచిపూడి నాట్యారామం చైర్మన్ పదవీ భాధ్యతలను స్వీకరించారు. |
ఈ సంఘటన సిలికానాంధ్ర మకుటంలో ఓ కలికితురాయిలా నిలుస్తుంది. 'తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి ' అనే నినాదంతో మొదలైన సిలికానాంధ్ర సంస్థకు మరిన్ని బాధ్యతలను కూడా. వివరాలకు 'ఈమాసం సిలికానాంధ్ర ' శీర్షిక చదవండి.
కవి, రచయిత, సంగీతకర్త శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు ఫిబ్రవరిలో నూరు సంవత్సరాల పుట్టిన రోజు జరుపుకొన్నారు. వారు స్వరపరచిన కొన్ని లలిత గీతాలను మార్చి 21న 'మన్మథ ఉగాది మహోత్సవం'లో సిలికానాంధ్ర కళాకారులు ఆలపించ బోతున్నారు. మరిన్ని వివరాలకు 'ఈమాసం సిలికానాంధ్ర ' శీర్షిక చదవండి. తప్పక విచ్చేయండి. సంవత్సరాది పండగను ఆహ్లాదంగా జరుపుకొందాం.
అలాగే, 'అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం (ఫిబ్రవరి, 21)' గుర్తు తెచ్చుకొంటూ, మన పిల్లలతో తెలుగు మాట్లాడుదాం. తెలుగు నేర్పించడం మరచిపోకండేం.
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)