సాయంత్రం 5 గంటలు అవుతుండటంతో వాకిట్లో మొక్కలకు నీళ్ళు పోస్తూ ఇక ఈయనొచ్చే వేళయ్యిందనుకుంటున్న గీతకు బండి హారన్‌లీలగా వినిపించింది. చేస్తున్న పనిని చకచక ముగించి గేటు తీసి భర్త రాకను గమనిస్తూ నిలబడింది గీత.
కొంత దూరం నుండే గీతను చూసిన కృష్ణ మొహంలో అప్పటి వరకూ ఉన్న చిరాకు పోయి, ఆనందం వెల్లివిరిసింది. బైక్‌ను తిన్నగా ఇంటి వాకిట్లోకి ఎక్కించేసి, బండి దిగి తాళం వేస్తూ 'ఇంటర్వూ లెటర్లేమైనా వచ్చాయా?' అని అడిగాడు కృష్ణ. 'కొత్తగా ఏమొస్తాయండీ' అంటూ అలవాటుగా భర్త చేతిలోని కారియర్‌బ్యాగందుకొని భర్త కన్నా ముందే లోపలకు వెళ్ళిపోయింది గీత. 'షూ'ను విప్పి లోపలకు వస్తున్న భర్తకు మంచి నీళ్ళందిస్తూ 'ఈ సంవత్సరం కూడా ప్రమోషన్‌రావడం లేదా?' అని అడిగింది. 'ఏమో? ఎవరికి తెలుసు? ప్రమోషన్‌అన్నది మన ఇష్టమా? మన చేతిలో ఉంటుందా?? అంతా మేనేజ్‌మెంట్‌ఇష్టమే' అన్నాడు కృష్ణ.
'అక్కడ జాయినయి నాలుగేళ్ళు దాటి అయిదో సంవత్సరం లోకి అడుగు పెట్టారు, మన పెళ్ళైన మూడేళ్ళలో మనకొక బాబు పుట్టుకొచ్చాడు గానీ, ఐదు సంవత్సరాలైనా కూడా ఏ ఎదుగూ బొదుగూ లేకుండా ఒకే పోస్ట్‌లో ఉండిపోయారు. పైగా ఆఫీసులో బెస్ట్‌వర్కర్‌అవార్డ్‌లు మాత్రం మూడొచ్చాయి. ఆ అవార్డ్‌లు ఏం చేసుకుంటారు? మీరు జాయిన్‌అవ్వనంత వరకు అసలు ఆ కంపెనీ పేరే ఎవరికీ తెలిసేది కాదటగా! అలాంటిది మీరు జాయినయ్యి, మీ సొంత తెలివి తేటలతో, ఇప్పుడు నెంబర్‌గా నిలబెట్టారు' అని మాట్లాడుతున్న గీత వైపు ఎర్రగా ఓ చూపు చూశాడు కృష్ణ. అంతే మ్యూట్‌నొక్కిన టి.వి. లాగా మారు మాట్లాడకుండా నిలబడిపోయిందామె.
''అయినా ప్రమోషన్‌రాలేదనే చిన్న కొరత తప్పించి, మిగిలిన వన్నీ బాగానే ఉన్నాయి కదే, పైగా ప్రతి సంవత్సరం 5000/- ఇంక్రిమెంట్‌కూడా ఇస్తున్నారు కదా!! ఇప్పుడు మనకేంటి ఇబ్బంది? నేను రోజూ అలా ఇంటర్వూ లెటర్ల గురించి అడగకపోతే నాకు ఇప్పుడున్న జాబ్‌బోర్‌కొడుతుంది కదా! ఇక నేను జాయినయ్యాక కంపెనీ నెంబర్1 లోకి రావడం అన్నది నా ఒక్కడి వల్లే కాదు, మిగిలిన వారందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అందుకని అవన్నీ బుర్రలో పెట్టుకోకుండా వెళ్ళి వేడి వేడిగా కాఫీ పట్టుకు రా'' అని గీతకు చెప్పి , అక్కడే వాకర్లో ఉన్న ఏడాదిన్నర కొడుకు 'వసంత్' ను ముద్దులాడుతూ కూర్చున్నాడు.
వేడి కాఫీని చేతికందిస్తూ, 'అయినా మీరొకసారి మళ్ళీ ఆలోచించండి. ఇన్నాళ్ళూ మీరూ, నేనే కనుక ఈ జీతం సరిపొయేది. ఇప్పుడంటే పిల్లాడు పెద్దవాడవుతున్నాడు కదా! వాడి భవిష్యత్తుకు ఇప్పటి నుండే మనం జాగ్రత్త పడాలన్నదే నా సలహా!!'' అని వెంటనే ఖాళీ కాఫీ కప్పునందుకుని లోపలకు వెళ్ళిపోయింది గీత.
''పెళ్ళైన మూడు సంవత్సరాలలో గీసిన గీత దాటని 'గీత'... ఇప్పుడింతలా చెబుతోందంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే'' అనుకున్నాడు. అంతలోనే 'గీతా...!' అని కేక వేసి ''ఇలా చూడు గీత. నువ్వు చెప్పింది కరక్టే. కానీ.. ఇప్పటికిప్పుడు నాకు మంచి ఉద్యోగం వచ్చి నేను ఉద్యోగం మారిపోతే , ఇన్నాళ్ళు నన్ను నమ్ముకొని నామీద ఇన్ని బాధ్యతలు పెట్టిన ఈ కంపెనీ వాళ్ళను మోసం చేసినట్లవుతుంది కదా!! అది మనకే ప్రమాదమేమోనని ఆలోచిస్తున్నాను. కాదూ కూడదంటావా, ఇంతకన్నా మంచి జాబ్‌వస్తే అప్పుడు చూద్దాం, ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చినవన్నీ ఇంత కన్నా తక్కువయినవే కాబట్టి,. నువ్వేమీ కంగారు పడకుండా నిశ్చింతగా ఉండు'' అని ఊరటకలిగిస్తాడు.
భర్త తెలివితేటలు, సామర్థ్యం బాగా తెలిసిన గీత , కృష్ణ చెప్పిన మాటల్లో నిజముందని గ్రహించి, మీ యిష్టమని చెప్పి లోపలకు వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళగానే వాకర్లో ఉన్న వసంత్‌ను ఎత్తుకుని లేచేసరికల్లా ఎదురుగుండా అలమరలో అందంగా అమర్చిన మెమొంటోలు, చిన్నప్పుడు తనకొచ్చిన ప్రైజ్‌ల పైన పడిందతని దృష్టి. ఇంతలో భుజం మీదున్న బాబు ఏడ్వడంతో, వాటి నుంచి దృష్టి మరల్చి, బాబును ఊరుకో బెట్టే పనిలో పడ్డాడతను. గీత చెప్పినంతవరకూ కాకపోయినా, నిజానికి తనకున్న తెలివితేటలకు, చేస్తున్న ఉద్యోగం సరి కాదని, ఇంకా ఎక్కువ సంపాదించే తెలివితేటలు తనకున్నాయని ఓసారనుకున్నాడు.
మరుసటిరోజు కారియర్‌బాగ్‌చేతికందిస్తూ .. 'సాయంత్రం తొందరగా వచ్చేస్తే బయటకు వెళ్దామా?' అన్న గీతతో 'సరేలే చూద్దాం' అని రిస్ట్‌వాచ్‌చూసుకుని , అమ్మో టైం అయిపోతోంది,ఆఫీసుకు వెళ్ళిపోవాలంటూ , బైక్‌స్టార్ట్‌చేసి, వెళ్ళిపోయాడు. బైక్‌వీధిమలుపు తిరిగేంత వరకు చూస్తూ నిలబడిన గీత వైపు చూడకుండా , ఎప్పుడూ వర్క్‌మైండ్‌తో ఉండే కృష్ణ అలవాటుగా మలుపు దగ్గర హారన్‌కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అలా తిరగ్గానే, భారంగా నిట్టూర్చి, మిగిలిన పనుల్లో పడిందామె.
సాయంత్రం 5 గంటలకు ఆఫీసు నుండి ఇంటికొస్తూ, వీధి చివరినుండీ హారన్‌కొట్టినా గానీ, గీత బయటకు రాకపోయేసరికి ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్న కృష్ణ, ఇంటి ముందు ఆగి ఉన్న ఫారెన్‌కారుని చూసి, 'మన ఇంటికి ఫారెన్‌కార్లో వచ్చే వారెవరబ్బా??' అని అనుకుంటూ, బైక్‌ను బయటాపి దిగి, గేటు తీసి బండి లోపల పెడుతుంటే, ఇంట్లోంచి బయటికొచ్చి, యథాలాపంగా కారియర్‌బ్యాగ్‌అందుకున్న భార్యతో, 'ఇంటర్వూ లెటర్లేమైనా వచ్చాయా?' అని అడిగిన అతన్ని చూసి, చిన్నగా నవ్వి, 'లెటరేంటండీ... ఇంటర్వూ చేసే వారే మన యింటికి వచ్చారు' అని సమాధానమిచ్చింది.
ఏంటే నువ్వు చెప్పేది? ఇంతకీ ఎవరొచ్చారు? అని అడుగుతూనే హాల్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా సోఫాలో కూర్చుని, కాఫీ త్రాగుతూ ,అక్కడే టీ పాయ్‌మీదనున్న మాగజైన్‌చదువుతున్న వ్యక్తిని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయి, అంతలోనే ఆనందపడ్డాడు. అప్పటి వరకూ కూర్చొన్న ఆ వ్యక్తి , కృష్ణను చూడగానే ఒక్కసారిగా లేచి నిలబడి, 'హాయ్‌రా కృష్ణ.. హౌ ఆర్‌యు..? ఎంత కాలమైందిరా మనం కలసి' అంటూ నవ్వుతూ పలకరించాడు. ప్రతి స్పందనగా కృష్ణ కూడా, 'హాయ్‌రా అర్జున్‌ఎలా ఉన్నావ్? ఇన్నాళ్ళూ ఏమైపోయావ్? షడన్‌గా ఎక్కడి నుండి ఊడి పడ్డావ్‌రా? ఈ సూటేంటి? అసలేం చేస్తున్నావ్?' అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ పలకరించాడు.
'ఆగాగు! అన్నింటికి నింపాదిగా నేను సమాధానాలు చెబుతాను. బాగా అలసిపోయి వచ్చావు, ముందు నువ్వెళ్ళి ఫ్రెష్‌అయ్యి రా!! నేను ఇక్కడే ఉంటాను' అని అర్జున్‌అనగానే వెంటనే గీతను లోపలకు పిలిచి, వీడూ నేనూ ఫ్రెండ్స్‌అని చెబుతున్న భర్తను వారిస్తున్నట్లుగా, 'ఆ సంగతులన్నీ నాకు తెలుసును, అర్జునన్నయ్య రాగానే నాకు అన్ని విషయాలు చెప్పా'రంది గీత.
భార్య అలా అనగానే కొంచెం చిన్నబుచ్చుకున్న కృష్ణ అంతలోనే మళ్ళీ 'సరేలేరా, ఇక్కడే ఉండు నేను రిఫ్రెషయి వస్తా'నని లోపలకు వెళ్ళిపోయాడు. 'గీతా...! స్నానానికి నీళ్ళు పెట్టు' అని చెప్పి, అర్జున్‌రాకకు గల కారణాలను ఆలోచించే పనిలో పడ్డాడు. కాసేపటికి నీళ్ళు సిద్ధంచేసింది గీత. దీర్ఘంగా ఆలోచిస్తున్న అతన్ని చూసి, 'ఏంటండి? అంతలా ఆలోచిస్తున్నారు?' అని అడగ్గానే, ఏమిలేదని చెప్పి లేచి స్నానం చేసి వచ్చాడు.
అర్జున్ని చూసిన దగ్గర్నుండీ తన భర్తలోవచ్చిన మార్పును గమనిస్తున్న గీత, ఇక ఉండ పట్టలేక, విషయం ఏమిటని భర్తను అడిగే ప్రయత్నం చేసి, తనకు చేప్పేటంత విషయమైతే తప్పకుండా చెబుతాడు కదా! అని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఇంకేంటిరా విషయాలు? అంటూ అర్జున్‌తో మాట్లాడుతున్న భర్తలో, ముందుండే ఉత్సాహం కానీ, చురుకుదనం కానీ కనిపించకపోవడాన్ని కూడా గీత గమనిస్తూనే ఉంది . డిగ్రీ వరకూ కలసి చదువుకున్న ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఈయనేంటి ఇలా ఉన్నారని, అర్జున్ని చూస్తే మంచి వాడిలాగానే కనిపిస్తున్నడే? తెగ ఆలోచిస్తోంది గీత.
ఇలా ఉండగానే, "ఏమోయ్‌గీత..." అన్న పిలుపు వినపడగానే, ఒక్క ఉదుటన హాల్లోకి వెళ్ళిన ఆమెను, అర్జున్‌కి పరచయం చేయబోయాడు కృష్ణ. "మా పరిచయాలు అయిపోయాయిరా! మీ అబ్బాయిని కూడా పలకరించేశాను. నీ పేరు అడిగిన నన్ను చాలా వింతగా చూసి, ఒక పట్టాన ఇంట్లోకి రానీయ్యని గీత తెలివితేటలు అమోఘం. మన కాలేజీ ఫేర్‌వెల్‌పార్టీలో తీయించుకున్న ఫొటోలో నిన్ను, నన్ను చూపిస్తేనే గానీ లోపలకు రానియ్యలేదు. మొత్తానికి నువ్వు చాలా లక్కీ ఫెలోవిరా!" అని పొగుడుతున్న అర్జున్‌మాటకు అడ్డుతగులుతూ, "దానిదేం ఉందిగానీ ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావ్? " అని సూటిగా ప్రశ్నించాడు కృష్ణ.
"మన డిగ్రీ అయిపోయాక, మీరందరూ పి.జీ. ల్లో జాయినయిపోయారు. అయితే డిగ్రీ ఎగ్జామ్స్ లో స్లిప్‌పెట్టాననే కారణంతో నీ సిన్సియార్టీతో నన్ను స్క్వాడ్‌కి పట్టించావు గుర్తుందా?" అన్న అర్జున్‌మాటలకు తలదించుకుని కృష్ణ, "సారీరా, అప్పుడేదో తెలియక, చిన్న తనంలో అలా చేసేనే గానీ, నువంటే పడకకాదురా" అని చెబుతున్న అతనితో, "సరేలేరా అప్పుడు నన్ను ఒక సంవత్సరం డిబార్‌చేశారు. ఆ తర్వాత ఏదో రకంగా డిగ్రీ పాసై, మా నాన్న గారి ప్రోత్సాహంతో ఫారెన్‌వెళ్ళి అక్కడే చదివి, చిన్న బిజినెస్‌స్టార్ట్‌చేశాను. అక్కడ మంచి లాభాలు రావడంతో బాగా సంపాదించాను. చాలా సంవత్సరాల తర్వాత మన దేశం రావాలనిపించి వచ్చాక, నాకెందుకో ఇక్కడే బిజినెస్‌స్టార్ట్‌చేయాలనిపించింది. ఇప్పుడా పనిమీదనే ఉన్నాను. ఎలాగో ఫ్రెండ్స్‌ని కలసి చాలా రోజులయ్యిందని, ఇలా వచ్చానంతే" నని తన కథను చెప్పాడు అర్జున్.
"అన్నట్టు, నువ్వు కూడా జాబ్‌మారడానికి చూస్తున్నట్లుగా, గీత మాటల్లో తెలుసుకున్నాను. అయినా నువ్వు మరీ మొండితనంగా ఉన్నట్లనిపిస్తోందిరా! నువ్వు మాత్రం ఏమీ మారలేదు. అదే వ్యక్తిత్వం, అదే సిన్సియారిటీ. అయినా నువ్వు నాలా కాదు కదరా! చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కదా! అన్నీ ఫస్ట్‌క్లాసులే కదా! ఏ తెలివితేటలు లేని నేనే ఈ పోజిషన్‌లో ఉన్నానంటే, అమోఘమైన తెలివితేటలున్న వాడివి నువ్వు నాకంటే మంచి పొజిషన్లో ఉంటావని ఊహించాను. కానీ, నీ మొండితనం, సిన్సియార్టీ అంటూ, చూడు ఎలా తయారయ్యావో? నేను బిజినెస్‌స్టార్ట్‌చేస్తున్నాను కదా, నాకూ ఎలాగూ ఒక పార్ట్నర్‌కావాలి, ఆ పార్ట్నర్‌నువ్వే ఎందుకు కాకూడదు? నీదగ్గర తెలివుంది, నా దగ్గర డబ్బుంది, ఇద్దరం కలసే బిజినెస్‌స్టార్ట్‌చేద్దాం, ఏమంటావ్? "
"నువ్వు పైసా కూడా పెట్టుబడి పెట్టనక్కర్లేదు. కానీ నీ తెలివితేటలు ఉపయోగిస్తే చాలు. నీకెంత జీతం కావాలో అంత తీసుకో, ఇక్కడొక దగ్గరే కాకుండా మనమిద్దరం ఫారెన్‌లో కూడా బిజినెస్‌చేద్దాం. అసలిన్నాళ్ళూ నువ్వెక్కడున్నావో తెలియక నానా పాట్లూ పడ్డాను" అని అంటున్న అర్జున్ మాటలు వింటున్న గీత ఆనందానికి అవధులు లేవు. కానీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తున్న భర్త వైపు కోపంగా చూస్తోందామె. మళ్ళీ అర్జునే మాట్లాడుతూ, "నీకు కృష్ణ అనే పేరు మాత్రమే పెట్టారు కానీ నీ గుణగణాలు, శక్తి సామార్థ్యాలు నాకు బాగా తెలుసు. కృష్ణుని పేరు పెట్టుకున్న రాముడివన్న నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతోనే, కావస్తే నా కంపెనీ పవర్‌ఆఫ్‌పట్టా రాసిస్తాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే నేనేం చెయ్యాలో చెప్పు చేస్తాను. ఎందుకంటే స్నేహం కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక నీ ఇష్టం" అని అన్నడు.
"ఏమండీ! అంత మంచి ఆఫర్‌యిస్తుంటే, ఒప్పుకోకుండా ఇలా ఆలోచిస్తారేంటండి? ఒప్పుకోండి" అని గీత ఒక పక్క చెబుతున్నా కూడా ఇంకా దీర్ఘంగా ఆలచిస్తున్నాడు కృష్ణ. పావుగంట వరకూ నిశ్శబ్దం ఆవరించిందక్కడ. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ గొంతు సరిజేసుకున్నాడు కృష్ణ." నాకొంచెం టైం కావాలి రా", అని అర్జున్‌తోటి అనగానే , "సరేరా, టేక్‌యువర్‌ఓన్‌టైం, ఇదిగో నా విజిటింగ్‌కార్డ్. నువ్వే ఫోన్‌చెయ్యి. ఇందులో బలవంతమేమీ లేదు. సరేనా! ఇక వెళ్ళోస్తానురా, వస్తానమ్మా"!! అని చెప్పి చకచక కారు దగ్గరికి వెళ్ళి, డోర్‌తీసి పట్టుకొని, "నువ్వు, నేను కలిస్తేనే మంచిదనిపిస్తోందిరా! డిగ్రీలో నిన్ను ఏడిపించేవాడినని , నన్ను దుర్మార్గుడని అని ఆలోచించకు.
అదేదో చిలిపితనం, చిన్న వయసు అంతే, మరిక ఉంటాను" అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు.
8 గంటలు ఆఫీసులో పని చేసి, యింటికి రాగానే , ఇదంతా జరిగేసరికి కృష్ణ కు తలనొప్పి స్టార్టయింది. బుర్రంతా వేడేక్కిపోయింది. గీతా...! అని కేక వేసి వేడిగా కాఫీ తెమ్మన్నాడు. "ఏంటండీ అంతలా ఆలోచిస్తున్నారు"? అంటూ కాఫీ చేతికి అందిస్తూ అడిగింది గీత. "ఏమిలేదు,నేను డిగ్రీ పాసై 15 ( పదిహేను) సంవత్సరాలు అయ్యాయి. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు నా ఫ్రెండ్స్‌అందరితోనూ నాకు అటాచ్మెంట్స్‌ఉన్నాయి. అయితే వీడూ, నేను ఇంటర్, డిగ్రీ కలసి మొత్తం అయిదు సంవత్సరాలు చదువుకున్నాం. కానీ ఆ 5 సంవత్సరాలు ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఎప్పుడూ దుడుకుగా ఉండేవాడు.అమ్మాయిలను ఏడిపించేవాడు. లెక్చరర్లను కామెంట్ చెసేవాడు. ఇంకా చాలా అల్లరి చేసేవాడు. వీడితో మాట్లాడాలంటేనే నాకు అదోలా ఉండేది. ఆఖరికి ఎక్జామ్స్‌లో స్లిప్పులు పెడితే సహించలేక కంప్లేంట్‌చేశాను. దాని వలన వాడికి నామీద కక్ష , పగ ఉండి ఉంటాయనుకున్నాను. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలూ ఏమయ్యాడో, నాకే కాదు, మా ఫ్రెండ్స్‌ఎవరికీ తెలియదనే వాళ్ళు".
"చాలా సంవత్సరాల తర్వాత వచ్చి, పార్ట్‌నర్‌అవుదామంటున్నాడు, అందుకని వీడిని ఎంత వరకూ నమ్మవచ్చోనని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నా మీద పగ సాధించడానికి వచ్చి, నాకిప్పుడున్న ఉపాధి కూడా పోగొట్టాలని చూస్తున్నాడేమోనని అనిపిస్తోంది." అని కృష్ణ అనగానే , "దీనికంత ఆలోచన దేనికండీ? అవన్నీ చిన్ననాటి అల్లర్లు, వాటిని మరచిపో అని చెప్పి వెళ్ళాడు కదా! అయినా మీరు మరీనండి! ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం, అదీ తెలిసీ తెలియని వయసులో చదువుకునే రోజుల్లో జరిగిన వన్నీ గుర్తుంటాయా?? అన్నీ గుర్తుపెట్టుకుని మరీ మీ మీద పగ సాధించడానికి వెతుకుంటూ వస్తాడా? అలాంటి ఆలోచనలన్నీ పక్కన బెట్టి ఆయనతో కలసి బిజినెస్‌చేస్తేనే మంచిదనిపిస్తోంది. కోరి ఇంటికొచ్చిన అవకాశాన్ని విడిచి పెట్టకండీ!" అని భర్తకు హితోక్తులు చెప్పింది.
"నీ మాటల్లో కూడా కొంత వరకు నిజం ఉందనిపిస్తోంది. కానీ, వాడు చెప్పింది ఎంత వరకు నిజమో తెలియకుండా, చేస్తున్న జాబ్‌వదిలి వెళ్ళిపోవడం మంచిది కాదేమోనని నా ఆలోచన" అన్న భర్త మాటలు పూర్తి కాకుండానే "మీరింకేమీ ఆలోచించకుండా అతనికి ఫోన్‌చేసి ఒ.కె చెప్పేయండి" అని ఖరాఖండిగా చెప్పేసింది గీత. అప్పటికే రాత్రి మించిపోవడంతో "సరే చూద్దాంలే" నని ముక్తసరిగా చెప్పి నిద్రకుపక్రమించారు. చేస్తున్న ఉద్యోగం మారిపోతే ఎలాగనే తలంపు తో కృష్ణకు, ఆయన ఉద్యోగం మారిపోతే బాగుండుననే ఆలోచనలతో గీతకు ,చాలా సేపటి వరకూ నిద్ర పట్టలేదా రాత్రి. ఉయ్యాల్లో బాబు పాలకోసం ఏడవగానే గీత లేచి బాబును ఎత్తుకోగానే, బాబు గురించి భవిష్యదాలోచనలు ఒక్కసారిగా కృష్ణ మనసులో మెదిలాయి. అంతే, ఎన్నాళ్ల నుంచీ చేస్తున్నా ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం వదిలేద్దామనే నిర్ణయం తీసుకుని నిద్రపోయాడు.
మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్‌నెంబర్‌కు కాల్‌చేసి, నీతో బిజినెస్‌చేయడం కన్నా, నీ దగ్గర చేస్తెనే నాకు బాగుంటుందని చెప్పేశాడు కృష్ణ. దట్స్‌గుడ్. పోనీలేరా ఏదోరకంగా నాకు దగ్గరౌతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని అర్జున్ చెప్పి ఫోన్‌కట్‌చేశాడు . తానంత వరకు పని చేసిన జి.కె గ్రూప్‌ఆఫ్‌కంపెనీకు ఆ రోజే రిజిగ్నేషన్‌పంపించి, తన రెజ్యుమోతో సహా అర్జున్‌దగ్గరకు వెళ్ళాడు. కృష్ణను చూస్తూనే నేరుగా తన చాంబర్‌లోకి ఆహ్వానించాడు. బిజినెస్‌ఎడ్మినిస్ట్రేషన్‌లో అపార అనుభవమున్న కృష్ణను తన స్టాఫ్‌అందరికీ పరిచయం చేస్తూ," ఈ రోజు నుండి ఈయన కూడా ఇక్కడే వర్క్‌చేశ్తారు.మీకు నేను ఎలాగో, ఈయన కూడా అలాగే నన్నమాట. అంటే నాలాగే ఇతను కూడా బాసంటూ" స్టాఫ్‌అందరికీ చెప్పాడు. పరిచయాలయిపోయాక ఎవరెవరి చాంబర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు.
M.D చాంబర్లో కూర్చున్న అర్జున్ కెదురుగా కూర్చొని ఉన్న కృష్ణకు, తన బిజినెస్‌వివరాలన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చాడు. అంతా విన్నాక , "సో నీ మేజర్‌బిజినెస్‌కనస్ట్రక్షన్‌అన్న మాట", అని ఆలోచనలో పడ్డాడు కృష్ణ. "ఇంకా నీ అంటా వేంట్రా? ఇది మన బిజినెస్. A.K Group of companies ."అంటే అర్జున్‌కుమార్ Group of companies అనా?" అని కృష్ణ అడగ్గానే, కాదు.. అర్జున్‌కృష్ణ Group of companies ". "ఇకపోతే నీ జీతం, నువ్వు పాత కంపెనీలో డ్రా చేసిన దానికి డబుల్‌ఉంటుంది. ఇదిగో ట్రిపుల్‌బెడ్‌రూమ్‌ఫ్లాట్‌తాళాలు, రోజూ ఇంటికి కారొస్తుంది.అందులోనే ఆఫీసుకు రావడం , వెళ్ళడం. ఇక నా బిజినెస్‌లోకి నిన్ను సాదరంగా స్వాగతిస్తున్నాను". అంటున్న అర్జు మాటలకు ఆనందం ఉబికి వస్తున్నా కూడా "ఇప్పుడెందుకురా ఇవన్నీ" అని అనకుండా ఉండలేకపోయాడు. "సరే అభిమానంగా ఇస్తున్నావు కానీ, ఫ్రీ ఉండడానికి నాకు గిల్టీగా ఉంటుంది". అని అన్నాడు కృష్ణ. "సరే ఫ్రీ గా ఉండక్కర్లేకుండా ఎంతో కొంత నామినల్‌గా పే చేయచ్చులే, అది కూడా నీ యిష్టమే" అని చాలా కూల్‌గా చెప్పాడర్జున్.
"చివరిగా ఒక్కమాట. ఎలాగూ నాతో కలసే ఉంటావు కదా! ఇదిగో ఈ పేపర్లను చూసి చిన్న సంతకం పెట్టెస్తే ఇక మనం పని ప్రారంభించవచ్చు" అని అర్జున్ అనగానే "ఏంట్రా ఆ పేపర్లని తీసుకుని చదివాడు కృష్ణ. మొత్తం చదివాక , అంటే 5 సంవత్సరాలు ఎగ్రిమెంట్‌అన్నమాట. ఇంతకీ ఎందుకురా ఇది"? అని అడిగే లోపలే, "ఏం లేదురా మన మధ్య స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉంటుందో, ఉండదో తెలియదు కదా! అయినా బిజినెస్‌అన్నాక ఇదంతా కామనే కదా! నీకు తెలియనిదేముంది?" అని సమాధానమిచ్చాడు అర్జున్. మంచి జీతం, మంచి వసతులు, అన్నింటికీ మించి మంచి హోదా కల్పిస్తున్న స్నేహితుడనే నమ్మకంతో సంతకం పెట్టాడు కృష్ణ.
"ఈ 5 సంవత్సరాలలోనూ నేను పెట్టుబడి పెట్టడమే తప్పా లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నేనేమీ అడుగను. 5 వ సంవత్సరంలో చూసుకుందాం. లాభమొస్తే ఇద్దరం సమానంగా పంచుకుందాం, ఒకవేళ నష్టమొస్తే నేనొక్కడినే భరిస్తాను. ఆ తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చును. అది నీ ఇష్టం" అన్న అర్జున్‌మాటలకు సమాధానంగా ఏదో అనబోతున్న కృష్ణను వారించి "ఇక ఏమీ మాట్లాడకు, ఇదే ఫైనల్, పద భోజనం చేద్దాం" అనగానే" ఏంటి? భోజనం కూడా ఇక్కడేనా"? అంటూ తెగ మురిసిపోయాడు. సాయంత్రం వరకూ ఏదో మాట్లాడీ ఇంటికి వెళ్ళేసరికే సామాన్లన్నీ పేకింగ్ చేస్తున్నారు. దూరం నుండే కృష్ణను చూస్తూనే గీత ఆనంద పడుతూ, "ఏమండీ ఇన్నాళ్ళకు మీరనుకున్న హోదాకు చేరుకున్నందుకు నాకు సంతోషంగా ఉందండీ" అంటూనే ఆ బండి మీదనే కొత్త ఫ్లాట్‌కు చేరుకున్నారు.
మరుసటి రొజు పొద్దున్నే 9 గంటలకే ఆఫీసుకు వచ్చిన కృష్ణ సిన్సియార్టీని మెచ్చుకుంటూనే ," ఇక ఈ ఆఫీసు బాధ్యతలు నీ చేత్లో పెడుతున్నాను" అన్న అర్జున్‌కి "థాంక్స్" చెప్పి, వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ఇంకా అప్పుడే స్టార్టవుతున్న ఆఫీసు కాబట్టి చాలా తక్కువ మందే స్టాఫ్‌ఉన్నారు. ఉన్న ఆ కొద్ది మందితోనే పని ప్రారంభించాడు కృష్ణ. కన్‌స్ట్రక్షన్‌బిజినెస్‌కాబట్టి, టెండర్ల వ్యవహారాలు చూసుకునే బాధ్యత కూడా అతనికే అప్పజెప్పాడర్జున్. ఏ పనైనా చాలా సులువుగా, చాకచక్యంగా చేస్తున్న కృష్ణను చూసి మొదట్లోనే స్టాఫందరూ మెచ్చుకున్నారు.
ఆరు నెలలు గడిచేసరికల్లా , కృష్ణ వర్క్‌లో బిజీ అయిపోయాడు. స్టాఫందరూ కూడా కష్టపడి పని చేస్తున్నారు. ఇంటికి రావడం కూడా లేటవుతోంది. గీతతో మాట్లాడే తీరిక కూడా లేకుండా పోతోంది. వసంత్‌ను ఎత్తుకుని ముద్దులాడడానికి కూడా టైం లేనంతగా మారిపొయాడు . ఎలాగూ లంచ్‌ఆఫీసులోనే కనుక సాయంత్రం 6 గంటలకు ఇంటికొచ్చేవాడు. రాన్రానూ రాత్రి 7 గంటలు దాటెది. ఇంటికొచ్చినా కూడా ఆఫీసు ఫొన్లే. ఎప్పుడూ టెండర్లూ, కొత్త ప్రాజెక్ట్‌లంటూనే తిరిగేవాడు. 10 మంది స్టాఫ్‌తో ప్రారంభించిన ఆఫీసు 30 మందికి చేరుకుంది. ఆ తర్వాత 50 మందయ్యారు. ఆఫీసులో అందరికీ కృష్ణ ఎంత చెబితే అంత. ఎదురు చెప్పేవారు కాదు. మారు మూల మేడ మీద అద్దె రూంలో స్టార్టయిన ఆఫీసు కాస్తా, విశాల మైన పెద్ద బిల్డింగ్‌లోకి మార్చారు. కొత్త బిల్డింగ్‌లోకి మారిన దగ్గర్నుండీ అతనికి బాధ్యతలు పెరిగాయి. స్టాఫ్‌కూడా పెరిగారు. అయితే ప్రతి చిన్న దానికి అర్జున్‌దగ్గర్కు వెళ్ళాల్సి రావడం, చెక్‌మీద సంతకాలు పెట్టడానికి అర్జున్ దొరక్కపోవడంతో, చిన్న చిన్న టెండర్లు మిస్సయ్యెవి. ఇది గమనించిన అర్జున్, కృష్ణకు చెక్‌పవరిచ్చాడు. అంత చనువిచ్చినా దాన్నెప్పుడూ కూడా తన స్వార్థానికి వాడుకోలేదతను. అతని సిన్సియార్టీతో A.K Group of companies ను సంవత్సరం తిరిగే సరికే కనస్ట్రక్షన్‌లో నెంబర్‌గా ఉన్నG.K Group of companies కు ప్రధాన పోటీదారుగా తయారు చేశాడు.
స్నేహితుని పని తనాన్ని పక్కనే ఉండీ గమనిస్తున్న అర్జున్, అతనికొక "విల్లా" ను కేటాయించాడు. "నాకెందుకిప్పుడని" కృష్ణ చెబుతున్నా వినిపించుకోకుండా దగ్గరుండీ వాళ్ళను విల్లా లోకి మార్చేశాడు అర్జున్. కృష్ణకున్న బాధ్యతలు పెరుగుతున్న కొలది రోజు రోజుకు తమ నుండి భర్త దూరమయిపోతున్నాడనే దిగులు, గీతలో పెరిగిపోతోంది. ఇంటి నుండి ఫోన్‌చేసినా ఎత్తే పోజిషన్ లో కృష్ణ ఉండేవాడు కాదు. ఇంకొన్ని రోజులకే వాళ్ళ కంపెనీ నెంబర్‌పొజీషన్‌కు చేరుకుంది. కృష్ణ ఆనందానికి అవధులే లేవు. ఇప్పుడు అతను ఇంటికి వెళ్ళడం రాత్రి 11 దాటుతోంది. భర్త కోసం చూసి చూసి గీత నిద్ర పోయేది. బాబును చూడడానికే టైం సరిపోయేది కాదు. పొద్దున్నే ఆరు గంటలకే ఆఫీసుకు వెళ్ళిపోయేవాడు. రెండు పూటలా భోజనం అక్కడే! గీత చేతి వంట తిని ఎన్నిరోజులయ్యిందో?
"కొన్ని రోజులు ఆఫీసుకు దూరంగా ఉండి, గీతను తీసుకుని ఎటైనా వెళ్ళమని అర్జున్‌అన్నాకూడా, "మనమిప్పుడే కదా నెంబర్‌కి వచ్చాం.దీన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇంకొన్ని రోజులు పోనీలే" అని దాటవేశాడు. తన చేతిలో ఎన్ని కోట్ల డబ్బులున్నా కూడా అదంతా పరాయి వాళ్ళ డబ్బని మాత్రమే చూసేవాడు. ఎలాగూ ఇందులో నెంబర్‌కాబట్టి, కొత్త బిజినెస్‌స్టార్ట్‌చేద్దామనగానే అర్జున్‌కూడా ఒ.కె. అనడంతో టెక్స్‌టైల్స్‌లోకి అడుగు పెట్టారు. ఇందులో మోసాలు జరిగే అవకాశం ఉంది గనుక ప్రతి విషయాన్ని కృష్ణే దగ్గరుండీ చూసుకునేవాడు. క్యాంపులకు వెళ్ళేవాడు. రాన్రానూ స్టాక్‌ను తెచ్చుకోవడానికి, మిగిలిన పనులకు ఫారెన్‌వెళ్ళి రావాల్సి వచ్చేది. ఒక్కోక్క సారి రెండు వారాల పైనే ఉండి పోయే వాడు. గీతతో మాట్లాడటానికి గానీ వసంత్‌తో ఆడుకోడానికి గానీ అస్సలు టైం దొరికేది కాదతనికి. ఎంతసేపూ బిజినెస్,బిజినెస్.
"చక్కగా సాయంత్రం 5 గంటలకు ఇంటికొచ్చేసే ఉద్యోగం నుండీ అనవసరంగా మారమని చెప్పాన్రా బాబు" అని గీత అనుకోని రోజులేదు. తండ్రి సంరక్షణ లేకుండా పెరుగుతున్నాడు వసంత్.ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు కదా! వారు చూసుకుంటారులే అన్న ధీమాతో ఉన్నాడు కృష్ణ. ఏ బిజినెస్‌స్టార్ట్‌చేసినా కూడా నెంబర్‌స్థానానికి ఎదిగిపోయేది A.K Group of companies . వాళ్ళు కొత్త బిజినెస్‌స్టార్ట చేస్తున్నారని తెలియగానే ,మిగిలిన వారి గుండెలు వేగం పెరిగేవి. ఇలా నాలుగు సంవత్సరాలు తిరేగే సరికి ఎక్కడెక్కడ ఏ ఏ ఆస్తులున్నాయో, ఏ ఏ బిజినెస్‌లున్నాయో అర్జున్‌కే తెలియనంతగా అభివృద్ధి చేశాడు కృష్ణ. అయితే అంతా మాత్రం అర్జున్‌పేరు మీదనే ఉండేవి. మధ్య మధ్యలో అప్పుడప్పుడూ, ఇంత డబ్బున్నప్పుడే మనం బాగుపడాలని గీత ఎన్ని సార్లు చెప్పినా , ఇదంతా ప్రెండ్‌సొమ్మే కానీ మనది కాదని , నన్ను పూర్తిగా నమ్మి బాధ్యతలు అప్పజెప్పిన నా స్నేహితున్ని నేను మోసం చేయలేనని చెప్పేవాడు కృష్ణ. బంధువులతో కానీ, ప్రెండ్స్‌తో గానీ మాట్లాడే తీరిక లేకుండా ఉండేవాడతను. జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా, డాక్టరెప్పుడూ అందుబాటులోనే ఉండే వాడు.
ఒకరోజు మధ్యాహ్నం గీత నుండి ఫోనొచ్చిందంటూ P.A. తెచ్చి ఫోనివ్వగానే, నేను మీటింగ్‌లో ఉన్నానని చెప్పేలోపలే, వసంత్‌కిందపడిపోయాడని, ముక్కులోంచి రక్తం రావడంతో, హాస్పటల్‌కు తీసుకువెళ్ళేనని , అన్ని టెస్టులు చేసి, "లుకేమియా" అంటున్నారని గీత ఏడుస్తూ చెప్పింది. అంతే వెంటనే మీటింగ్‌కాన్సిల్‌చేసి, హాస్పటల్‌కు వెళ్ళాడు. డాక్టర్లతో మాట్లాడగానే, "మీరు చాలా లేట్‌చేశారు మిస్టర్‌కృష్ణ. బాబుని పూర్తిగా పట్టించుకోలేదనుకుంటాను. ఇప్పుడు పూర్తిగా ముదిరిపోయింద"అని డాక్టర్లు చెప్పగానే ఎంత డబ్బైనా ఫర్వాలేదని కృష్ణ ప్రాధేయపడ్డాడు.
మొత్తానికి ఫారెన్‌నుంది స్పెషలిస్ట్‌లను తెప్పించి వసంత్‌కు ట్రీట్‌మెంట్‌చేయించారు. బాబు ఆరోగ్యం కుదుటపడింది. కానీ తనను, బిడ్దను పట్టించుకోలేదని, గీత అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది." నా దగ్గర డబ్బుంది కాబట్టి అంత కాస్ట్లీ ట్రీట్‌మెంట్‌ఇప్పించ గలిగాను. కానీ అంత డబ్బులేని వాళ్ళ పరిస్థితి ఏమిటని"? కృష్ణ ఆలోచనలో పడ్డాడు. మనమే ఒక హాస్పటల్‌కట్టించి, ఇలాంటి వాటికి చాలా తక్కువ ఖర్చుకే వైద్యమందించాలనే తలంపు వచ్చిందతనికి. అంతే! ఆలోచన వచ్చిందే తడవుగా ఆఫీసుకు వెళ్ళి, ఈ విషయం గురించి స్టాఫ్‌తో మాట్లాడాడు. అందరూ చాలా సంతోషించారు. చాలా మంచి ఆలోచన అని ప్రతి ఒక్కరూ అతన్ని మెచ్చుకున్నారు. అయితే" అంత హాస్పటల్‌అంటే చాలా ఖర్చు అవుతుందని" కొందరు చెప్పారు.
"ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదని" కృష్ణ అనడంతో అందరూ చప్పట్లు కొట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అతనికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌ఒక్కటే మనం బిజినెస్‌మైండ్‌తో కాకుండా చేస్తున్నందుకు నాకు ఆనందంగా ఉందని స్టాఫ్‌అందరితో చెప్పాడు. ఆ ఆఫీసులో అందరికన్నా ముందు నుండీ పని చేస్తున్న రామారావు మాత్రం, అర్జున్‌గారికొకసారి చెప్పమని సలహా యిచ్చాడు. "అర్జున్‌ఇప్పుడు U.S.A ఉన్నాడు కదా, అయినా ఏ ప్రాజెక్ట్‌ప్రారంభించినా తనతో చెప్పక్కరలేదని ముందే చెప్పాడు. వాడు నా ఫ్రెండే కదా! వాడు అటునుండీ వచ్చాక వివరంగా అన్నీ నేనే చెబుతాను" అని కృష్ణ అనడంతో ఎవరెవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయరు. ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ ను తొందరగా ప్రారంభించి, పూర్తి చేయాలనే తపనతో అతనున్నాడు. హాస్పటల్‌నిర్మాణానికి కావాల్సిన స్థలం సేకరించారు. మంచి పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి తన ఇన్‌ప్లూయెన్స్‌ఉపయోగించి పర్మిషన్‌తెపించాడు . మంచి రోజు చూసి ఇక శంకు స్థాపన చేయడమే మిగిలింది. హాస్పటల్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్‌కు ఎడ్వాన్స్‌గా చెక్‌పంపించేశాడు కృష్ణ. ఆ ప్రాజెక్ట్‌పూర్తయితే పది మందికి ఉపయోగపడుతున్నాననే ఆనందంలో కూడా "గీత" గురించిన ఆలోచనే రాలేదతనికి.
సరిగ్గా మూడో రోజున U.S.A నుండి అర్జున్‌వచ్చేశాడు. ప్రతి రోజూ లాగానే ఆరోజు కూడా ఉదయాన్నే 7 గంటలకే ఆఫీసుకు వెళ్ళి, ఏవో పనుల్లో బిజీగా ఉన్న కృష్ణ దగ్గరకు P.A వచ్చి ఒక చెక్‌ను చూపిస్తూ , "సర్‌మీరు ఆ ఎక్విప్మెంట్‌ఏజెన్సీకి ఇష్యూ చేసిన చెక్‌చెల్లదని బ్యాంక్ వాళ్ళు రెఫ్యూజ్‌చేశారట" అని చెప్పాడు. "వాట్‌నాన్సెన్స్‌యూ ఆర్‌టాకింగ్? నేనిచ్చిన చెక్ చెల్లక పోవడమేమిటి? ఎకౌంట్‌లో చాలా డబ్బుంది కదా!!" అని కృష్ణ అంటుండగానే , "ఎకౌంట్‌లో డబ్బుల్లేక కాదట సార్, చెక్‌వెనక్కి పంపింది". అని P.A అనగానే, "ఎకౌంట్లో డబ్బుండీ కూడా చెక్‌రిటనొచ్చిందా?? కారణం ఏంటట?" అని రెట్టించిన గొంతుతో కృష్ణ అడుగుతుంటే, "సంతకం మారిందట సర్" సమాధానమిచ్చాడు P.A.
"వాట్? సిగ్నేచర్‌మారిందా? ఏదీ ఇలా ఇవ్వు" అని చూసి ,"ఇది నా సైనే కదా! ఎక్కడా తేడా లేదు కదా! ఏమయింది? ఎందుకు రిటనొచ్చింది?" అనుకుంటూ వెంటనే బ్యాంక్ కు ఫోన్‌చేశాడు. "ఒక సారి బ్యాంక్‌కు వచ్చి మాట్లాడండి "అని రెక్లెస్‌గా సమాధానం చెప్పి ఫోన్‌పెట్టేసిన మేనేజర్‌మీద విపరీతమైన కోపమొచ్చిందతనికి. "నిన్నటి దాకా చాలా వినయంగా, ఉన్న బ్యాంక్ మేనేజర్‌కేమయ్యింది"? అని అనుకొని వెంటనే బ్యాంక్‌కి వెళ్ళాడు. తిన్నగా మేనేజర్‌దగ్గరకు వెళ్ళి విషయమేమిటని అడిగాడు. ఎప్పుడు కృష్ణ వచ్చినా లేచి నుంచొని మరీ విష్‌చేసే మేనేజర్, తన రూం లోకి వేళ్ళినా కనీసం కూర్చోమని కూడా అనకపోవడంతో కోపమొచ్చి, సిగ్నేచర్‌గురించి గట్టిగా అడగగానే , "మీకు చెక్‌పవర్‌లేదని, మీ హెడ్‌ఆఫీస్‌నుండి మాకు లెటరొచ్చింది" అంటూ చూపించాడు. "అదేంటని ఆశ్చర్యపోతూ", ఆ లెటర్‌తీసి చూశాడు. తనకు చెక్‌పవర్‌తీసేస్తున్నట్లు స్వయంగా అర్జునే పంపించాడు. ముందు నమ్మక పోయినా బ్యాంక్‌మేనేజర్‌స్వయంగా చెప్పడంతో సరేనని అటునుండటే అర్జున్‌బంగ్లాకు వెళ్ళాడు.
తిన్నగా అర్జున్‌రూం లోకి వెళ్ళే ప్రయత్నం చేసిన కృష్ణను అక్కడి పనివారడ్డుకున్నారు. "రేయ్‌వచ్చింది ఎవరనుకున్నార్రా"? నేన్రా కృష్ణనని చెప్పినా సరే, సార్‌బిజిగా ఉన్నారని, కాసేపు ఆగాలని అక్కడే ఆపేసారతన్ని. చేసేదిలేక అక్కడే ఉండిపోయాడు. కాసేపయ్యాక, అర్జున్‌రమ్మనడంతో అతని రూంలోకి వెళ్తూనే, "ఏంట్రా ఇది? ఎప్పుడూ లేని అడ్డంకులేంటి?" అని ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళిపోతున్న కృష్ణ వైపు చూసి, ఓ నవ్వు నవ్వాడు అర్జున్. "నాకు చెక్‌పవర్‌పోవడమేమిటి?" అని సూటిగా ప్రశ్నించాడు కృష్ణ. అవేమీ పట్టనట్టుగా కూల్‌గా ఉన్న అర్జున్‌చూస్తుంటే కృష్ణకు అంతకంతకు కోపం పెరిగిపోతోంది. "నాకొచ్చిన కోపానికి, ఎదురుగుండా ఉన్నది నువ్వు కాకపోతే, ఏంచేసే వాడ్నో"నని ఊగిపోతున్న కృష్ణను చూస్తూనే " ఏంచేస్తావ్?" అని అర్జునడిగాడు.
"సరే! ఇన్ని మాటలెందుకు గానీ, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావ్?" అని కృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అదే గదిలో ఉన్న టేబుల్‌డ్రాయర్‌లోంచి పేపర్లను తీసి, "ఇవేంటో తెలుసా?" అని అతనికి చూపించాడు అర్జున్. "ఇవి మన ఎగ్రిమెంట్‌పేపర్లు. ఈ ఎగ్రిమెంట్‌ప్రకారం , మూడు రోజుల క్రితమే 5 సంవత్సరాల ఎగ్రిమెంట్‌అయిపొయింది. సో, మూడు రోజుల క్రితమే ఆటోమెటిగ్గా నా పార్ట్‌నర్‌గా నీకున్న అన్ని పవర్స్‌పోయాయి. ఒకవేళ నీకేదైనా జాబ్‌కావాల్సి వస్తే నా దగ్గర ఖాళీ ఉంటే నేనే చెప్తాలే". అని మాట్లాడుతున్న అర్జున్‌వైపే చూస్తూ నిలబడిపోయాడు కృష్ణ. "అదేంట్రా? మన ఫ్రెండ్ షిప్పో మరి?" అన్న మాటకు "స్నేహం స్నేహమే , బిజినెస్‌బిజినెస్సే అని నువ్వే కదా చెప్పావు మరచిపోయావా?"అని అంటున్న అర్జున్‌మాటలకు కృష్ణ గుండాగిపొయినట్లైంది.
"హాస్పటల్‌గురించి చెప్పలేదని కోపమేమైనా వచ్చిందా"? అని కృష్ణ అంటుండగానే, "అయినా నా డబ్బుతో నిన్ను బిజినెస్‌చెయ్యమన్నాను కానీ , ఇలా కోట్లకికోట్లు నువ్వు సేవలు, దానధర్మాలంటూ మొదలుపెడితే, నేనేమయిపోవాల్రా"? అని అర్జునడిగాడు. "సరేలే! పోనీ నీ ఎగ్రిమెంట్‌ప్రకారమే 5 సంవత్సరాల తర్వాత లాభమొచ్చిందిగా, అందులో నా వాటా నాకిచ్చేస్తే, నేను వెళ్ళిపోతానన్నాడు కృష్ణ. "నీ వాటానా? ఎందులోంచి ఇమ్మంటావు? అయినా ఇందులో నీదంటూ, నీకంటూ ఏమీ లేదు! అంతా నాదే, ఇక నువ్వు వెళ్ళ వచ్చును". అని అర్జున్ అంటుంటే, "మరి ఐదు సంవత్సరాల క్రితం నేనాఫీసులో జాయినయినప్పుడు, ఇందులో లాభమొస్తే యిద్దరం పంచుకుందాం, నష్టమొస్తే నువ్వు ఒక్కడివే భరిస్తానన్నావు కదరా"?
"నువ్వెంత అమాయకుడివో నీకే తెలియట్లేదు కృష్ణ. ఇంకా నువ్వేదో తెలివైన వాడివనుకున్నాను. అయినా నువ్వు చాలా తెలివైన వాడివనే పొగరు కదా నీకు. నేను నా చిన్న తనం నుండి నిన్ను చూస్తునే ఉన్నాను కదా!, నీ తెలివి తేటలు ఉపయోగించుకొని, నేను సంపాదించుకున్నాను. కానీ నీకవి ఉపయోగపడకపోతే అది నా తప్పా?నిన్నెవరూ మోసం చేయలేరనే , ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో, గుడ్డిగా ఈ పేపర్ల మీద సంతకం పెట్టావు. అయినా నేనప్పుడే చెప్పాను 5 సంవత్సరాల తర్వాత నువ్వు వెళ్ళి పోవచ్చనని. కానీ నువ్వే నన్నాశ్రయించి ఉన్నావ్" అంటూ అర్జున్‌మాట్లాడటం 5 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా చూస్తున్నాడు కృష్ణ.
"మరి మన మధ్యనున్న స్నేహం సంగతేంటి"? అని ఈసారి చాలా కోపంగా అడిగాడు కృష్ణ. "స్నేహమా? మన యిద్దరి మధ్యా? అని నువ్వనుకుంటే సరిపోతుందా? ఇంటర్‌చదువుతున్న దగ్గర్నుండే నన్ను చూస్తున్నావ్‌కదా! ఎప్పుడైనా నీకు, నాకుపడేదా? అనవసరంగా నా డిగ్రీని సంవత్సరం లేటు చేసిన నువెప్పుడూ నాకు శత్రువ్వే అవుతావు గానీ, మిత్రుడివెలా అవుతావురా? డిగ్రీ లో డిబారయ్యానని తెలిసి, మా నాన్న గారు కొట్టడం నేనింకా మరచిపోలేదు. ఎంతో ముద్దుగా చూసుకునే మా నాన్నగారి చేత కొట్టించిన నిన్ను ఎప్పటికైనా పగ సాధించలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు". అని అర్జున్‌అన్నాడు.
"మరి మా యింటికొచ్చీ మరీ, స్నేహితుడవని, చెప్పావ్? పాతరోజులు మరచిపో, అదంతా గతమంటూ, నన్ను ఎందుకు జాయిన్‌చేసుకుని, నాకు ఫ్లాట్, కారు, ఇవన్నీ యిచ్చావు?" అని ఆశ్చర్యంగా అడుగుతున్న కృష్ణ తో, "అదా, ఫారెన్‌నుండి ఇండియా రాగానే బిజినెస్‌స్టార్ట్‌చేద్దామని అనుకుంటున్నప్పుడు, నాకు ప్రధాన పోటీ దారు, నువ్వు పనిచేసే కంపెనీ.., వాళ్ళను ఎలా డామినేట్‌చేయాలని ఆలోచిస్తే, ఆ కంపేనీ అభివృద్ధిలో నువ్వే కీలకం అని తెలిసింది. ఎలాగూ నీ మీద నాకు కోపముండనే ఉంది. డబ్బుకి నువ్వు లొంగవని నాకు తెలుసు. అందుకే నేనే మీ యింటికి వచ్చీ మరీ నిన్ను ఇందులోకి వచ్చేటట్లు చేశాను. నీ కన్నా తెలివైన వాళ్ళు లేరనుకోకు కృష్ణ. దాన్ని నువ్వు స్నేహమని పొరబడ్డావంతే! ఎలాగూ 5 సంవత్సరాల బాండ్‌కాబట్టి నువ్వు వెళ్ళవని తెలుసును. ఇక ఫ్లాట్, కారు, ఇవన్నీ ఇచ్చింది నిన్ను పూర్తిగా నమ్మించి, నేను పైకి రావడానికి. ఎలాగూ నువ్వు నిజాయితీ పరుడవని తెలిసే చెక్‌పవరిచ్చాను. కానీ నువ్వే వాడుకోలేని మూర్ఖుడివి. అందుకే ఇన్నాళ్ళూ నువ్వు నీ సోంతానికి డబ్బు డ్రా చేస్తే, ఆ నేరం కింద నిన్నేమైనా చేద్దామనుకున్నాను. నువ్వా పని చేయలేదు మై ఫ్రెండ్."
"దుర్మార్గుడా! నేను మారిపోయానన్నావు కదరా" అని పళ్ళు కొరుకుతూ కృష్ణ అనగానే, "ఎలా అనుకున్నావు రా! నువ్వు నీ వ్యక్తిత్వం మార్చుకోకుండా ఉన్నావు కదా, మరి నేను మారుతానని అనుకోవడం నీ అమాయకత్వం". అని అర్జున్‌అన్నాడు.
"మరి అహర్నిశలు కష్టపడి, భార్యా పిల్లల్ని కూడా వదిలి మరీ నీ కంపెనీ కోసమే కష్టపడ్డాను కదరా! మర్యాదగా నా వాటా నాకు ఇస్తావా? లేక కోర్టుకెళ్ళమంటావా??" అన్న కృష్ణ ను చూసి వెటకారంగా నవ్విన అర్జున్, "నీకింతలా చెప్పినా అర్ధం కావటం లేదా? ఇందులో నీకు వాటా లేదని! రాదని...!! అన్నట్లు పురాణాలు, ఇతిహాసాలు బాగా చదువుకున్నావు కదా! ఆ భాషలోనే చెబుతా విను" అని అర్జున్‌చెబుతుంటే, అసలేం మాట్లాడుతున్నాడో అర్ధం కావడంలేదు కృష్ణకు. "అయినా సరే నేను కష్టపడి నీకింత లాభం తెచ్చిపెట్టాను కాబట్టి మర్యాదగా నా వాటా నాకివ్వు" అని మొండిగా వాదిస్తున్న కృష్ణ తో "ఆగాగు అక్కడికే వస్తున్నా, అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదిలితే ఆ గుర్రం వెళ్ళిన రాజ్యాలన్నీ ఆ గుర్రాన్ని వదిలిపెట్టిన రాజువవుతాయి గానీ, నా వల్లే ఈ రాజ్యం వచ్చిందని, ఎప్పుడైనా, ఎక్కడైనా ఆ గుర్రం అడగటం విన్నామా?? నువ్వు కూడా ఆ గుర్రం లాంటి వాడివే! నీ తెలివి తేటలు ఉపయోగించుకున్న నేనా రాజు లాంటి వాడ్ని. ఎక్కడో అడవిలోనో, ఇంకెక్కడో ఉండాల్సిన గుర్రాన్ని తీసుకు వచ్చి బాగా అలంకరించి, వెంట చాలా మంది పరివారాన్నిచ్చి పంపించే అశ్వమేధ యాగం కరక్టయితే, నేను చేసింది కూడా నూటికి నూరుపాళ్ళు కరక్టే. రాజ్యం వచ్చింది గుర్రం వలన కదా అని ఆ గుర్రాన్ని బాగా చూసుకోరు సరికదా, యాగం పూర్తి అవగానే దాన్ని చంపేస్తారని కూడా చదువుకున్నట్లు గుర్తు. నువ్వూ నేను కలిసి చదువుకున్నాం, 5 సంవత్సరాలు నా క్రింద పనిచేశావనే జాలితో నిన్ను చంపకుండా వదిలేస్తున్నందుకు సంతోషించు. నేను చేసిన ఈ ’వ్యాపారం’ అనే "అశ్వమేధయాగం"లో నువ్వు కేవలం "యజ్ఞాశ్వానివి" అని మాత్రమే గుర్తుంచుకుంటే మంచిది. కాదూ కూడదంటావా... నువ్వు కోర్టుకు వెళ్ళినా కేసు నిలవదు. ఏమీ చదవకుండా సంతకం పెట్టినందుకు నీదే తప్పంటారు తప్పించి, నాకు పోయేదేమీ లేదు. అర్ధమయ్యిందనుకుంటాను" అనగానే కృష్ణకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అక్కడనుండి బయటికి వస్తుండగానే గీత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. డబ్బు సంపాదనలో పడి తానెంత తప్పు చేశానో గుర్తించిన కృష్ణ, వెంటనే గీత దగ్గరకు వెళ్ళాడు. కళ్ళ నీళ్ళతో, అవమాన భారంతో విచారంగా వస్తున్న భర్తనుచూడగానే , గీత కూడా క్షమించినట్లుగా కళ్ళతోనే తన మనోభావాల్ని తెలియజేసింది. ఆడుకుంటున్న వసంత్‌నెత్తుకుని ముద్దుపెట్టుకోగానే వెయ్యేనుగుల బలమొచ్చినట్లయ్యింది. మళ్ళీ కొత్త కంపెనీలో జాయినయి దాన్ని నెంబర్‌కు తెచ్చే పనిలో పడ్డాడు కృష్ణ. ఇంకెప్పుడూ తెలివైన వాడిననే అహాన్ని ఎక్కడా ప్రదర్శించలేదతను. ఉన్నదాంట్లోనే ఎలా సంతృప్తిపడాలో గీతకు అప్పుడు బాగా అర్ధమయ్యింది.