కవితా స్రవంతి
మనవడికి ఋణగ్రస్తులవుతున్నాము...
- డా. రావి రంగారావు

భారతదేశం మట్టి
అమెరికా నీరు
విశ్వ వ్యాపితమైన గాలి, అగ్ని, ఆకాశం
ఈ పంచభూతాల సమ్మేళనం
మా మనవడి జననం...

బిడ్డ రంగు
తెలుపా ఎరుపా నలుపా అనే
మా వర్ణ వివక్ష గమనించి
వాడు చిద్విలాసంగా నవ్వుతుంటాడు...

బిడ్డ పోలికలు
మా వాళ్లవా, మా వియ్యంకుడి వాళ్లవా అనే
నా సంకుచిత ఆలోచనలను
వాడి చూపులతో పరిశుభ్రం చేస్తుంటాడు...

బిడ్డ బుద్ధి
నాదా, మా వియ్యంకుడిదా అనే
నా భావనల పరిమిత బుద్ధిని
వాడి పిడికిళ్ళతో పగలగొడుతుంటాడు...

బిడ్డ గొప్ప జాతకుడై
ఎలాగోలా బాగా డబ్బు సంపాదించాలనే
నా ఇరుకు తలపుల్ని
వాడి కాళ్ళతో అదే పనిగా తన్నుతుంటాడు...

మొత్తానికి ఒకటి మాత్రం నిజం-
వా డెక్కడినుంచి వచ్చాడో ఏమోకాని
వాడికి మేము ఋణపడిఉన్నామో
వాడు మాకు ఋణపడిఉన్నాడో
రోగాలతో సతమత మవుతున్న నేను, నా భార్య
మనవడి సేవలో కొత్త ఆరోగ్యాన్ని పొందుతూ
వాడికి జన్మజన్మలకు ఋణగ్రస్తు లవుతున్నాము...

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)