పదునాలుగేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకొని పదిహేనవ వసంతంలోకి అడుగిడింది సిలికానాంధ్ర. అక్టోబర్ 24న 'ఆంధ్రసాంస్కృతికోత్సవం-2015' అట్టహాసంగా జరపటానికి ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతియేడు ఈ ఉత్సవ సందర్భంగా వెలువడే సుజనరంజని ఓ ప్రత్యేకతను సంపాదించుకొన్నది. ఉత్సవానికి వచ్చే అతిధులందరు పుస్తకరూపంలో వచ్చే అమూల్యమైన ప్రతిని పదిలంగా భద్రపరచుకొంటారు.
ఈ సంవత్సరపు సుజనరంజని ప్రత్యేక సంచిక 'నవత-యువత ' అనే అంశం ప్రాతిపదికగా వెలువడుతుంది. అంశానికి తగ్గట్టుగానే ఇరవై (20) ఏళ్ల లోబడిన పిల్లలనుండి రచనలను సిలికానాంధ్ర ఆహ్వానిస్తున్నది. అంటే పందొమ్మిది లేదా అంతకంటే తక్కువ వయసున్న అమ్మాయిలు, అబ్బాయిలనుండి కథ, వ్యాసం, కవిత, గేయం, కార్టూన్లు, జోకులు, చిత్రలేఖనం, సంగీతం మొదలుగాగల ప్రక్రియలనుండి రచనలను ఆహ్వానిస్తున్నది. ఈ ప్రయత్నం ముఖ్యోద్దేశం యువతలో రచనాసక్తిని, సాహిత్యాభిలాషను, సృజనాత్మకశక్తిని పెంపొందించడమే.
ప్రచురితమయ్యే ప్రతి కథకు, వ్యాసానికి ,కవితకి, గేయానికి, కార్టూనికి తగిన విధంగా నగదు రూపేణ పారితోషికం ఉంటుంది. మీ రచనలను sujanaranjani@siliconandhra.org అనే ఈ-మెయిల్ కు పంపండి. రాతప్రతులను పంపించటానికి పోస్టల్ అడ్రస్: Sujanaranjani, Flat No. 102, Ratnanidhi Arcade, Sri Ramachandra Enclave, East Anandbagh, Hyderabad, 500047.
ప్రచురింపబడని రచనలను అంతర్జాల మాసపత్రికలో నెలనెలా ప్రచురిస్తాము.
పెద్దలకు ఒక విన్నపం. ఈ సమాచారాన్ని పిల్లలకు చేరవేయండి. వారిని ప్రాత్సాహించండి. అలాగే పిల్లలకు సంబంధించిన రచనలు మీ దగ్గర ఉంటే పంపండి. 'నవత-యువత ' అంశానికి దగ్గరగా ఉంటే ప్రచురిస్తాము.
రచనలు చేరవలసిన ఆఖరు తేదీ: అక్టోబర్ 12, 2015
కృతజ్ఞతాభివందనాలు!!