ఈ సంచికలో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి.
ఆగష్టు 1న జరిగిన సిలికానాంధ్ర 15వ వార్షికోత్సవంలో పిల్లలే కౌరవసభలో జరిగే 'శ్రీకృష్ణరాయబారం' ఘట్టాన్ని నాటకంగా వేసారు. పిల్లలందరూ పదమూడేళ్లలోపు వాళ్లే. అమెరికాలో పుట్టిన వాళ్లే. రెండు వారాల్లో నంది అవార్డు గ్రహీత గుమ్మడి గోపాలకృష్ణగారి వద్ద శిక్షణ పొందారు. భారీ సెట్టింగులతో రూపొందిన వేదికపై తగు ఆహార్యంతో, ప్రత్యేక దృశ్య శ్రవణ హంగులతో పెద్ద డైలాగులను అవలీలగా చెప్పారు. పద్యాలన్నింటిని రాగయుక్తంగా ఆలాపించారు. ప్రేక్షకులందరిని ఆశ్చర్యచకితులను చేసారు. ఈ నాటకానికి సంబంధించిన ఒక ఫోటోను ముఖచిత్రంపై చూడండి.
అక్టోబర్ 24న 'ఆంధ్ర సాంస్కృతికోత్సవం-2015' జరపటానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిలికాన్ వ్యాలీలో ఉన్న తెలుగు వారందరికి ఇదే సిలికానాంధ్ర ఆహ్వానం.