కవితా స్రవంతి
ప్రార్ధించే పెదవులకన్నా
- తమిరిశ జానకి

పచ్చని గరిక పారే సెలయేరు
విరిసిన పూవులు విహంగాల వింత ధ్వనులు
పరవశించె హృదయం పసిపాపనవ్వులా
తన్మయత్వానగానం
తరంగాలుగా కదిలె మలయసమీరాన కలిసి !
ఎంత హాయి ఇదిమాత్రమే జీవితమైతే !
ఇదే జీవనమైతే !
కాదుకాదంటున్నాయి
ఆకలిబతుకులు చాపిన చేతులు
భవితవ్యం కానరాని చూపులు నిండిన కన్నులు !
దిక్కులేని అనాధల దీనగాధలు
నాణానికి మరోవైపు చూడమంటున్నాయి !
ఆల్చిప్పలే అయినాయి కన్నులు ఆవైపు చూశాక
పారే సెలయేరు వారి కన్నీరులా కనిపించి
కరిగిపోయింది మనసు !
వాడిపోతున్నపూలు వారి బ్రతుకులే అనిపించి
విహంగాల ధ్వనులు వారి వీడ్కోలుగా తోచి
వారికై చేశాను ప్రార్ధనలు నేత్రాలు చెమరించి !
ప్రార్ధించే పెదవులకన్నా సాయపడే చేతులు మిన్నయని
తెలిశాక మరి ఆగలేక చేరువయ్యాను వారికి
చేయగల సాయాన్ని అందివ్వడానికి !
చిత్రమేమిటంటె అది నా గొప్ప కాదు
పరమాత్మ నా మనసున కలిగించిన స్పందన అది
ఆ పరమాత్మ నాకు చూపిన
సాటిలేని మేటి బాట అది !


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)