ధారావాహికలు

శ్రీరామ! నీ నామమేమి రుచిర!

- ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం

చం.

నలుబదియేండ్లు దాటినవి నా తలితండ్రుల పల్లె వీడి, నా
తలపులు నేటికిన్ మసలు తన్మయతన్ చిననాటిపైని, ని
ర్మల జలజాత సంభవ మరంద సుగంధ సరస్సుపైని, భూ
తలమున స్వర్గమేయనగ్ దర్శనమిచ్చెడు దేవళంబుపైన్.

 

కం.

ఎన్నోమారులు తలచితి
చిన్నప్పటియూరికేగ చేతమందున్
మున్నెన్నడు వీల్గాలె
దిన్నాళ్ళకు పోవ నిశ్చయింతి కాంక్షన్.

 

ఉ.

ఆ విధి నే తలంచు సమయమ్మున “కూతురి పెండ్లి, పల్లెలో
కోవెలయందు, తప్పకను కొన్నిదినాలకుముందు నీవిటన్
రావలె న్” చు స్నేహితుడు వ్రాయ మనమ్మున సంతసించి నే
వావిరి నేగబూనితిని – ప్రాతస్మృతుల్ మదిలోన రేగగన్.

 

ఉ.

దారిని నా తలంపులు నితాంతము నే తొలియున్న యూరిపై
పారెను – పల్లె వృద్ధిలెనొ, వర్ధిలిరొ ప్రజ, లేరు పూటుగా
పారునో చెర్వునిండగను, పంటలు దండిగ పండుచున్నవో,
చేరెనో లేదొ పల్లెకు విశిష్ట వినూతన శాస్త్ర పద్ధతుల్.

 

శా.

ఆ నాడే వరిచేలు పండెడివి – వర్షాభావ సంవత్సరం
బైనన్ గూడ నొకింతగాను – మరి నేడాశ్చర్యమౌరీతి వి
జ్ఞ్నానద్భూతిని నూత్నద్ధతులు దేశమందు మార్మూలలన్
రానేవచ్చును – చొడు భూములు హేరాళంబుగ పండెదిని!

 

ఉ.

దేవళ మెట్టులుండినదొ! దేవుని పూజలు నుత్సవంబు లే
ప్రావను సాగుచుండినవొ! పాప మమాయికు డర్చకుండు సం
భాతిడై చెలంగునొ, సపక్షులు క్షేమముగా రహింతురో! –
ఆ విధి నే తలంచితి సహస్ర వ్ధంబుల పోవు దారిలో.

 

ఉ.

అట్టుల రైలులోన దినమంత ప్రయాణము జేసి, ఆ పయిన్
పట్టణమందు బస్సుగొని పల్లెకు పోయితి – చోద్యమయ్యె నా
చుట్టున నున్న గ్రామమును జూడగ్ అందున ఇళ్ళు గాని, యే
హట్టము గాని నే నెరుగ నైతిన్ – పూర్తిగ మారె గ్రామమున్.

 

కం.

వీరిని వారిని నమ్రత
దారెట్లని వేడి కొంత తడవకు నెటులో
చేరితి మిత్రుని సదనము
నా రాతిరి వేళ నాత డానందింపన్.

 

వచ్చే భాగంలో “శిధిలమైన గ్రామం

(సశేషం)



మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)