ధారావాహికలు - సుందరకాండ

(గత సంచిక తరువాయి భాగం)

- డా.అక్కిరాజు రమాపతిరావు

మనో హి హేతు: సర్వేషామింద్రియాణాం ప్రవర్తనే,
శుభాశుభా స్వవస్థాసు తచ్చ మే సువ్యవస్థితం
(సుందరకాండ 11-42)

“మంచిపని చెయ్యాలన్నీ, చెడ్డపని తలపెట్టినా అందుకు ఇంద్రియాలని ప్రోత్సహించేది మనస్సే కదా. ఆ మనస్సు నాలో ఏ దోషం లేకుండా ఉన్నది’ అని సమాధానపడ్డాడు.

సీతాదేవి కనిపించక హనుమంతుడి చింత


ఆయనకు వివిధప్రదేశాలలో దేవతాస్త్రీలు, గంధర్వాంగనలు, నాగకన్యలు, కనిపించారు. కానీ సీతాదేవి మాత్రం కనిపించలేదే అని ఆతృత చెందాడు. మళ్ళో ఇంకోసారి అన్ని చోట్లా వెతకాలని నిశ్చయించాడు. ఆ భవనంలోని లతాగృహాలలోకి, చిత్రశాలాగృహాలలోకి మళ్ళీ వెళ్ళి వెతికాడు. ఆయనకు చాలా విషాదం కలిగింది. సీతాదేవి కనబడకపోయేసరికి ఆమెని రావణుడు చంపేసాడో లేక ఈ రాక్షసుల వికారవేషాలను, చేష్టలను, భయంకర నేత్రాలను,భయపెట్టే ముఖాలను చూసి ఆమె ప్రాణాలు విడిచిఉంటుందేమోనని తలపోశాడు.

సుగ్రీవుడేమో చండశాసనుడు, కోపిష్టి, ఆయన విధించిన గడువు ఏనాడో గదచిపోయింది. నాకేమో సీతాదేవి కనిపించలేదు. నేను రామకార్యం సాధించలేక పోయినాను. మళ్ళీ నేను సుగ్రీవుడిని కలుసుకోలేనేమో! నేను సముద్రతీరం చేరగానే నాకోసం నిరీక్షిస్తున్న వానరులంతా చుట్టూ మూగుతారు. ఎంతో నిరాశపడిపోతారు. ఖిన్నులవుతారు. నేను సీతాదేవిని చూసి రాలేదని తెలుసుకుని ఆశాభంగం చెందుతారు. సుగ్రీవుడు పెట్టిన గడువు అయిపోయినందువల్ల ఆయన ప్రాయోపవేశం చేసి మరణించవలసి ఉంటుందేమో! అంగదుడు ఏమనుకుంటాడో! ఆ పరమ వృద్దుడు జాంబవంతుడు ఎంత పరితాపం చెందుతాడో అని హనుమంతుడు ఉద్వేగం చెందాడు. విషాదపుటాలోచనలు ఆయనను చుట్టుముట్టినందువల్ల నిర్వేదం పొందాడు. మళ్ళీ తెప్పరిల్లి ఇలా అనుకున్నాడు.

“అనిర్వేద: శ్రియో మూలమ్ అనిర్వేద్: పరం సుఖమ్,
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక:
కరోతి సఫలం జంతో: కర్మ యత్తత్ కరోతి స:
తస్మాదనిర్వేదకృతం యత్నం చేష్టే2 హ ముత్తమమ్”
- (సుందర కాండ 12-10,11)

“నిరాశపడకపోవడం (ఉత్సాహం) సంపదలకు మూలం. ఉత్సాహఏ పరమసుఖం. ఉత్సాహమే ప్రాణిని కార్యోన్ముఖుడిని చేస్తుంది. అతడు చేసే కార్యాన్ని సఫలం చేస్తుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా మరింత ఉత్తమ ప్రయత్నం చేస్తాను”

వచ్చే భాగంలో “ నిరుత్సాహం వీడి మళ్ళీ సీతాన్వేషణం”

(సశేషం)




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)