సుజననీయం

సంతోష సమయాలు!

-తాటిపాముల మృత్యుంజయుడు

'కష్టే ఫలీ' అన్నారు. దివగంగతులైన బాపుగారి సంస్మరణార్థం గతనెల వెలువరించిన సుజనరంజని ప్రత్యేకసంచికకు మంచి స్పందన లభించింది. పుస్తకాల బీరువాలో భద్రపరుచుకోదగిన పుస్తకంగా కితాబులు కూడా ఇచ్చారు. బాపుగారి మీద మొదటగా ప్రత్యేక సంచికను వెలువరించిన పత్రిక సుజనరంజని అయినందుకు చాలా సంతోషం వేసింది.

ఈ నెల 26, 27, 28 తేదీల్లో సిలికానాంధ్ర నాలుగవ 'అంతార్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం' ఘనంగా నిర్వహించనుంది. ఈ మహోత్సవంలో పాల్గొని దిగ్విజయం చేయాలని మా విన్నపం.

అలాగే తెలుగు బాషను ప్రాచీనభాష నుంచి ప్రపంచ భాషగా తీర్చిదిద్దాలనే లక్షంగా పనిచేస్తున్న సిలికానాంధ్ర మనబడి ఈ నెల 20 వ తేదీన నాలుగు వేల మంది పిల్లలకు తెలుగు నేర్పాలనే లక్ష్యాన్ని అధిగమించించడం ఎంతో సంతోషకరం.

ఇంకో నెలలో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సుజనరంజని పత్రికలో వైవిధ్యమైన శీర్షికలు మొదలెట్టాలని మా అభిమతం. మీ వద్ద నుండి విన్నూత్నమైన రచనలను ఆహ్వానిస్తున్నాం.

రచన-కౌముది కథల పోటీ వివరాలు 'జగమంత కుటుంబం' శీర్షికలో చూడండి. మంచి రచనలను పంపి 'తెలుగు కథ 'ను ప్రోత్సాహించండి.

వందనాలతో,
మీ
తాటిపాముల మృత్యుంజయుడు.




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)