కవితా స్రవంతి

వెన్నెల

గుడివాడ సిద్దని

పల్లవి:
మొహమాటమేలనే వెన్నెలా
మాటలాడరావేమే నిండుగా
కనుసైగలేలనే లీలగా
కవ్వింపు చాలునే ఏలరా II మొహమాటమేలనే II

చరణం:
ఊసాడ రమ్మంటే ఒద్దొద్దు అంటావే
వదిలేసి పోతుంటే వెనకెనక వస్తావే
ఏముంది మనసులో తెలుపవే అంటుంటె
తడబడిపోతావు తబ్బిబ్బు చేస్తావు II మొహమాటమేలనే II

ఊపిరే నాదంటూ ఆయువే పోసేవు
ఊహల్లో నేనంటు చింతలే తీర్చేవూ
జతకూడి పాడవేమే జావళి అంటుంటే
నీ మువ్వల సవ్వడిలో రాగమల్లి రాలేవా II మొహమాటమేలనే II

చరణం:
నాలోకి నే చేరే దారిలో నీ నవ్వే
దీపమై వెలగనీ దారినే చూపనీ
మౌనాలు మాటాడే మధువనే మనదంటూ
ఎలుగెత్తి చాటేము ఎడబాటు గెలిచేము II మొహమాటమేలనే II




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)