"చారిత్రక విభాత సంధ్యల
మానవ కథ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించినదే పరమార్థం?
ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గులకీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?"
పై విధంగా అంటారు శ్రీశ్రీ "దేశ చరిత్రలు" అన్న కవితలో. అవును నిజమే, మన భారతదేశ చరిత్రలో భాష, సంగీతం, సాహిత్యం, నాట్యం మొదలగు కళలు ప్రధానపాత్ర వహించాయి. ఈ చరిత్రనే మనం సంస్కృతి అంటున్నాం. ఆలాంటి భారతీయ సంస్కృతి కేంద్రంగా 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం' ముందుకు సాగిపోనున్నది. మున్ముందు, ఈ చరిత్రకు ఆధునికతను జోడిస్తూ కొత్త పుంతలు తొక్కనుంది. అందుకు 'Computational Lingustics'ను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రతీ ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమౌతుంది. మరి, మొదటి అడుగు పడింది. ఇక, ముందున్నది అతిపెద్ద ప్రయాణం. గమ్యం ఒక moving target. మీ అందరి ఆశీస్సులను కోరుకుంటున్నది సిలికానాంధ్ర.
- తాటిపాముల మృత్యుంజయుడు