అనాతవరం అనే గ్రామ శివార్లలో ఒక పంటకాలువ వుంది. కలువ ఇరుపక్కలా వరిపొలాలు, కలువగట్టు వెంబడీ మామిడి, సపోటా, అరటి వంటి చెట్లతో చిత్రకారుని చిత్రంలా ఉంటొంది ఆప్రదేశమంతా. ఆచెట్ల మధ్య ఉన్న గున్నమామిడి చెట్టుమీద ఒక కాకి దాని సంతానంతో కాపురముంటోంది. ఆకిందనేఉన్న కాలువగట్టునే ఓ కొంగల జంట తమ పిల్లతో నివాసముండేవి. రోజూ పైనించి కాకిపిల్లలు తెల్లగా అందంగా కనిపిస్తున్న బాతు పిల్లనిచూసి తెగ ముచ్చట పడుతూండేవి."అమ్మా చుడవే ఆబాతుపిల్ల ఎంత అందంగా ఉందో?" చందమామ రంగు, ఎర్రనిముక్కూ బుల్లి బుల్లి రెక్కలు, వాతితో అది తపతప నీళ్ళమీద కొట్టుకుంటూ తిరుగుతోంటే ఎంత బాగుందో?మరి మనమెందుకమ్మ ఇంతనల్లగా ఉన్నాము? అందరూ చీదరించుకునేల" అంటూ ఉండేవి. వాటిమాటలకి తల్లికాకి"భగవంతుని సృస్టి లో రకరకాల రంగుల పక్షులు ఉన్నాయికదా. మనది ఈరంగుమరి. ఐనా రంగుదేముందమ్మా మనసు తెల్లనిదైఉండాలిగాని"అంటూ సుద్దులు చెప్పేది. తల్లిమాటలు సరిగా అర్ధం కాక తికమకపడుతూ ఉండేవి. దానికిసాయం కొంగపిల్లతో అమాటకలపడానికి ఎంత ప్రయత్నించిన అది ముఖం తిప్పుకునేది.
ఒకరోజు పెడ్డకొంగలు లేని సమయంలో పిల్లకొంగ ఎగరడానికి ప్రయత్నిస్తూ నాచుపట్టిన నాపరాయి మీదకాలువేసి దబ్బున జారిపడింది. కుయ్యో మొర్రోమంటూ అరవసాగింది. దానీరుపులకి పైనగూట్లోంచి కాకిపిల్లలు తొంగిచూసాయి. కొంగపిల్ల నొప్పితో విలవిల్లాడుతూ పైన ఎగురుతున్న కొంగలబారుని రక్షింపమని అరుస్తోంది. అవిదీనీరుపులని పట్టించుకోకుండానే వెళ్ళిపోయాయి. కాకిపిల్లలకి కొంగబావని చూస్తే జాలేసింది. అవి ఒక్కసారిగా కావు కావు మంటూ తమ బంధువులందరి పిలిచి విషయం చెప్పాయి. కాకులన్నీ కలసి కొంగపిల్లని జాగర్తగా గట్టుకు చేర్చి అక్కది ఆకులని ముక్కులతో తెంపి కొంగకాలుకి మందు రాసి, దానికికాస్త తిండిపెట్టి పెద్దకొంగలు వచ్చే వవరకూ వుండి అప్పగించి వెళ్ళాయి.
మరునాడు కొంగపిల్ల కోలుకుని కాకిపిల్లలతో"నిన్నమీరునాకు చాలా సాయం చేసరు.అందమైనదాన్నని ఇన్నాళ్ళూ గర్వపడ్డాను.కాని సాయం చేసే గుణమే అందమైనదని తెలుసుకొన్నాను.మరి నాతో స్నేహం చెస్తారా?అని జాలిగా అడిగింది.కాకిపిల్లలు ఆనందంగా సరేనన్నాయి. అప్పుడే వాటికి వాళ్ళామ్మ మాటలు అర్ధమవసాగాయి.