సారస్వతం - పుస్తక పరిచయం
సమకాలీన స్థితి గతుల దర్పణం
"అమూల్యం" నండూరి కథల సంకలనం
- సమ్మెట ఉమాదేవి

14 కథలతో మన చేతుల్లో అమరిన అమూల్యం అనే ఈ సంపుటిలోని కథలు సున్నితంగా కనిపిస్తూనే సూటిగా హృదయాన్ని తాకుతాయి. బాలి గారి కుంచె చిత్రించిన అందమయిన ముఖ చిత్రం పాఠకుల మనస్సులో అమూల్యమయిన ముద్ర వేసుకుంటుంది కన్నెగంటి అనసూయ చెప్పినట్లు కాలానుగుణంగా కొత్త పుంతలు తొక్కుతున్న నేటి సాహితీ స్వభావాన్ని గతిని ప్రయోజనాన్ని చాల బాగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి నండూరి సుందరీ నాగమణి. ఎన్నో రచనలు చదివిన అనుభవం రచయిత్రి సాహిత్య సృజనకు దారి తీస్తే .. సమకాలీన రచనలును కూడా ఎంతో ఆసక్తిగా చదివే అలవాటు ప్రస్తుత సాహిత్యం పట్ల ఆమెకి మరింత అవగాహన పెరగడానికి దోహదం చేసింది. రచయిత్రికి సంగీతం పట్ల ఉన అనురక్తి చాల కథల్లో .. వాటి శీర్షికలలోనూ తెల్సుతుంటుంది. కథాంశాల ఎంపిక .. కథను మలుచుకున్న తీరు లోనే రచయితత నేర్పరి తనం బయట పడేది... ఇక కథలలోకి వెళ్తే ...ఉరకలేసే వయసులో ఎదురయిన ప్రతీ స్నేహం ప్రత్యేకంగానే కనపడుతుంది. చెల్లున చరిచే అనుభవాలు మనుష్య స్వభావాలను తెలుపుతాయని తొలి కథ మనసా ఎటులోర్తునే. చెబుతుంది.

చైల్డ్ అబ్య్యుజ్ వంటి కథాంశాన్ని తీసుకుని మన చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూనే ఆధునికత సాంకేతికత.. యువకులను నేరాలవయిపు యెట్లా మల్లిస్తుందో చెబుతుంది. అదే సమయంలో .. ప్రేమ తొలి లక్షణం క్షమా అని కథానాయకి తన ఔన్నత్యాన్ని చూపడాన్ని గ్రహణం అన్న కథలో చదువుతాం తెలిసీ తెలియక చేసిన వేసిన అడుగు ఆమె జీవితాన్ని బలి తీసుకోగా .. పది లేచిన కెరటంలా ఆమె నిలబడి .. కొడుకు నిర్లక్షానికి బలయిన తన తండ్రిని తన ఆసరాతో నిలబెడుతుంది కణ్వ శాకుంతలం కథలో .. కథానాయకి ఉడుకునీళ్ళు కథలో సహజమయిన మనవ స్వభావాలను చూపుతూ గ్రామీణ యాసను బాగా పండించింది. సైబర్ నేరాల బారిని పడుతున్న యువత పడుతున్న అవస్థలను తల్లి సహాయంతో ఎదుర్కున యువతి కథ మనలను ఉలిక్కి పడేలా చేస్తుంది .. అమ్మ చెప్పింది కథలో అమూల్యం అన్న కథలో స్నేహితుని పెళ్ళికి వెళ్తూ వీళ్ళతో పరిచయమే తప్ప ఫ్రెండ్షిప్ లేదు అన్న వాక్యం కథకు అవసరం లేదు అనిపించింది దుహిత కథలో వంటి అత్యాశపరులు స్వార్తపరులయిన అమ్మాయిలు మనకూ తారసపడుతున్నారు. అమ్మాయిల్లో అమ్మ నాన్నలంటే ఉన్న ప్రేమకన్నా ఆధునిక వస్తువుల పట్ల ఆస్తుల పట్ల వ్యామోహం పెరగడాన్ని రచయిత్రి చక్కగా చిత్రీకరించింది. మోసపోయానని తెలుసుకున్న వెంటనే ఆత్మహత్యల జోలికి వెళ్ళకుండా న్యాయవాది సహాయంతో తనను తాను నిలబెట్టుకున్న అపరాజిత కథ, ఇక ఎయిడ్స్ .. లాంటి ప్రాణంతక వ్తాది గురించిన ఆశాదీపం కథ, .. ఆధునిక సమాజపు నూతన పోకడల సహజీవనం గురించి రాసిన ఏనాడు విడిపోని ముడి వేసేనో కథ .. అన్నీ చదివించేగుణం ఉన్న మంచి కథలు. రచయిత్రి స్త్రీ పక్షపాతి కాదని శాంతా సుందరి గారు .. ఎన్నుకున్న కథాంశాలు కథలకు వన్నె తెచ్చాయని భువన చంద్రగారు ... సమకాలీన సమాజం లో అత్యంత వేగంగా పరివర్తన చేడుతున్న సామాజిక సమస్యల గ్రహణ శక్తి ఉన్న రచయిత్రి అని కన్నెగంటి అనసూయ గార్ల ప్రశంసలు పొందిన సుందరి నాగమణి మంచి భవిష్యత్తు ఉన్న రచయిత్రి. ఈమె కలం నుండి మరిన్ని మంచి కథలు ఆశించవచ్చు

రచన: నండూరి సుందరీ నాగమణి
ప్రచురణ: JV Publishers, Hydrerabad
వెల: Rs. 100


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)