సిలికానాంధ్ర పదునాలుగవ వార్షికోత్సవం
చూస్తుండగానే పదునాలుగేళ్లు గడిచిపోయాయి. పదిహేనవ వసంతపు గడపలో నిల్చొని గతంలోకి తొంగిచూస్తే కాలం ప్రవాహంపై సిలికానాంధ్ర చేసిన ప్రయాణం అద్భుతంగా గుర్తుండి పోతుంది. ప్రతి భాషా సైనికుడు, స్వచ్చంద సేవకుడు సహప్రయాణీకులే. 'తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి ' ముఖ్యోద్దేశంగా ప్రారంభించబడిన సిలికానాంధ్ర చేసిన ప్రయోగాలు ఎన్నో! జరిపిన ప్రముఖ ఘట్టాలు ఎన్నెన్నో!! 'అన్నమయ్య లక్ష గళార్చన ', 'అంతర్జాతీయ కూచిపూడి మహోత్సవం ', 'జయహో కూచిపూడి ' మొదలైనవి కొన్ని ఉదాహరణలుగా
పేర్కొనవచ్చు.
'ప్రాచిన భాషనుండి ప్రపంచభాషగా తెలుగు ' నినాదంతో, ఏకైక నిష్ఠతో ప్రారంభించబడిన 'మనబడి ', 'సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ' సిలికానాంధ్ర కిరీటంలో కలికితురాయిలుగా పరిగణించవచ్చు. సిలికానాంధ్ర వెలిగించిన 'తెలుగు జ్యోతి 'ని అభిమానులు, సిలికానాంధ్ర కుటుంబసభ్యులు అందిపుచ్చుకొని వేల 'జ్యోతులు ' వెలిగించారు. ప్రపంచమంతా వెలుగు నింపుతున్నారు.
పదండి. సిలికానాంధ్రతో పాటు అడుగు వేయండి. ఆభివృద్ధి పథంలో సాగుదాం. మరిన్ని అద్బుతాలు సృష్టిద్దాం. ఆశ్చర్యాలు చేద్దాం.
- తాటిపాముల మృత్యుంజయుడు
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)