గోదావరీ! పావన గోదావరీ! అశేష జనానీక ,
పాప ప్రక్షాళనం బొనర్చుచున్, ఆంధ్రావనిన్ పరవళ్ళు
ద్రొక్కి ప్రవహించు గోదావరీ! అఖండగోదావరీ! నమస్సులమ్మా
పవిత్ర పుష్కరదినంబులన్‌నీ నీటన్‌ముల్గినంత
మాత్రంబె జన్మ జన్మాంతర సంచిత పాపముల్
తొల్గంగాజేతువంచు,ఉల్లాసంబొప్పార, తమకంబునన్
మునుగుచున్,తేలుచున్ నీ పూజాదికంబులొనర్చు
చున్న, సర్వ మానవాళి పాపప్రక్షాలనంబొనర్చి
సదా బ్రోచుచున్నట్టి పావనగోదావరీ! నమస్సులమ్మ
ాస్వీయజలంబులన్‌అఖండాద్రావని క్షేత్రముల్
సస్యశ్యామలం బొనర్చుచున్ అశేష జనానీకమున్
ఆనందడోలికలనూగించు గోదావరీ! పావనగోదావరీ!
నమస్సులమ్మా !నీదు పుణ్యజలంబులన్‌తడిసి
పులకించి పుష్పించిన ఆంధ్రావనిక్షేత్రముల్‌తమ
సుగంధ సుమనోహ పరిమళముల్ నీదు మైపూతగా
నందివ్వగన్, సకలాంధ్రావని సస్యసంపద్భరితంబులైన
క్షేత్రముల్ నీకు నిత్య నైవేద్యంబొసంగన్ నీ
దివ్యత్వంబేమని పొగడగలమోయమ్మా,
మా నమః సుమాంజలులివె గైకొనవమ్మా ! గోదావరీ!
అఖండగోదావరీ!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)