చలి కలిగించే గిలిగింతలకు
తనువు లతలా కదలి ఆడుతుంటే
బ్రతుకు పువ్వు నవ్వులతో విరబూస్తుంది
హేమంతం పూబంతిలా మారుతోంది
పూలన్నీ గుత్తులై కలిసినట్లు
శరీరావయవాలన్నీకుంచించుకొనిపోతున్నాయి
నిన్నటి దాకా విచ్చుకొన్న శరీరం
నేదు ముడుచుకొనిపోయి
ముద్దబంతిలా మారుతోంది
వికసించడమ్ ఒక్కటే కాదు
ఒదిగి ఉండడం కూడా మనిషికి అందం
చలి పులి అనీ,
ఆకలిగొన్న క్రూరమృగమనీ
అనుకోరాదెప్పుడూ
నులివెచ్చదనం బ్రతుకుకు పచ్చదనమౌతుంది
ముడుచుకొనిపోయిన మేను విచ్చుకొంటుంది
విశ్వతోముఖంగా సాగేందుకు
విశాల విశ్వం వైపు చేయి సాచేందుకు !
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)