వీరు బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ - నానో సైన్స్ టెెక్నాలజీ కేంద్రంలో ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. "డిఫెన్స్ బయో ఇంగినీరింగ్ అండ్ ఎలెక్ట్రో మెడికల్ ల్యాబ్ " లో కీలక పాత్ర పొషిస్తున్నారు. ఈ ప్రయోగశాలలోనే అమోనియా, ప్రాణ వాయువు సెన్సార్లు రూపకల్పన చేసారు. అంతే కాదు మెంస్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఒత్తిడి ఆధారిత సెన్సార్లను రూపొందించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో కూడా ఆచార్యుడిగా పనిచేస్తున్నారు.
డాక్టర్ మోహన్ చేసిన పరిశోధనలు, సాదించిన ఫలితాలు - ఒనగూడిన ప్రయోజనాలు:
శూన్యం, పల్చ పొర పటలం సంకేతిక పరిజ్ఞానం - కొత్త పద్ధతులు, వాటి స్వభావాలు, లేజర్ ఆధారిత పూతలు, వైమానిక, అంతరిక్ష క్షేత్ర రంగాలలో విభిన్న పరికరాలు, ఉపకరణాలో ఉపయోగపడే వస్తువులకు రూప కల్పన చేశారు.
పల్చ పొర పరికరాలు, కొలిచే పరికరాలు, ఆకర్షకమైన పటలము, చిలుము, ఉపగ్రహాలకు అవసరమైన సూర్యకాంతితో పనిచేసే పరికరాల రూపకల్పనకు మిక్కిలి కృషి చేశారు. ఏడుగురు డాక్టరేట్ విద్యార్ధుల పర్యవేక్షకుడిగా వ్యవహరించారు.
విమానం బయట సమాచరం తెలుసుకునేందుకు దృశ్య సంధాన పరికరాన్ని కనుగొన్నారు. మైక్రో సెన్సార్స్ పరిశొధనలు జరిపి, విమానాలకు ఉపయోగపడే సెన్సార్లను రూపొందించి దేశీయ పరిజ్ఞాన వికాసానికి దోహద పడ్డారు.
సొసైటీ ఫర్ ఇన్నొవేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ నెలకొల్పి ఐ ఐ ఎస్ సి నుండి విలువడిన పరిశోధనా పరిజ్ఞానాలను పరిశ్రమకు అందించి ఈ క్షేత్ర వికాసానికి తోడ్పడ్డారు. అంతే కాదు వీటి ద్వారా భారత దేశానికి వందల కోట్ల విలువ చేసే ద్రవ్య మూలాన్ని ఆపాదించి పెట్టారు.
అమోనియా సెన్సార్, ప్రాణ వాయువు (ఆక్సిజన్) సెన్సార్లను తమ పరిశోధనల ద్వారా రూపొందించారు. ఈ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత యుద్ధ విమానం - తేజస్ లో ఇమిడ్చారు. . ట్యూనబల్ డయోడ్ లేజర్ మాస్ స్పెక్ట్రోమీటర్ విధానం ద్వారా అతి స్వల్ప ప్రెస్సర్ సెన్సార్లను, మైక్రో ఎలెక్ట్రికల్ మెకానికల్ (మెంస్) సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రూపొందించారు.
పల్చ పొర పటలాల సమ్యోగం, సమ్మెళణం, విస్లేషణ పద్ధతులలో డాక్టర్ మోహన్ నిష్ణాతులు. సింథసిస్ అండ్ అనాల్సిస్ ఆఫ్ థిన్ ఫిల్మ్ ఉపకరాలని రూపకల్పనకు విశిష్ట కృషి చేశారు. ఆప్టికల్ కోటింగ్స్, ట్రై బయొలాజికల్ కోటింగ్స్, సూపర్ కండక్టింగ్ ఫిలంస్, స్ట్రైన్ గేజ్ సెన్సార్స్ (వీటి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి).
భౌతిక శాస్త్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి అనేక ప్రయోగాలు చేశారు.
అంతరిక్ష క్షేత్రానికి ఉపయోగపడే తిన్ ఫిల్మ్ ప్రెసెర్ ట్రాన్స్డ్యూసెర్లు రూపొందించారు.
నిర్వహించిన ఉధ్యోగాలు:
ఐ ఐ ఎస్ సి, నానో ఎలెక్ట్రానిక్స్ కేంద్ర అధ్యక్షునిగా వ్యవహరించారు. కొంతకాలం చండీగర్ లోని సి ఎస్ ఐ ఓ సంచాలకుడిగా పనిచేశారు. ఐ ఐ ఎస్ సి లోని కొత్త కల్పనా కేంద్రం అధ్యక్షుడిగా ఉన్నారు. 1970 నుండి 1977 దాకా తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, భౌతిక విభాగం లో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆ తరువాత మోహన్ ఐ ఐ ఎస్ సి - ఇన్స్ట్రుమెంటేషన్ కేంద్రంలో సీనియర్ శాస్త్రాధికారిగా చేరి క్రమేపి అంచలంచలుగా ఎదిగి, విభిన్న హోదాలలో పనిచేశారు.
పాఠ్యాంశాలు:
హై వ్యాక్యూం తెక్నాలజీ, పల్చ పటలం (తిన్ ఫిల్మ్) డిస్ పొజిషన్, డివైసెస్, మైక్రో సిస్టంస్, పదార్ధాలు, పద్ధతులు గురించి పాఠ్యాంశాలలో బోధించారు.
గౌరవాలు, పురస్కారాలు:
మోహన్ అనేక గౌరవ, పురస్కారాలను అందుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
సి ఎస్ ఐ ఆర్ సంకేతిక పురస్కారం
సభ్యుడు, ఇండియన్ నేష్నల్ సైన్స్ అకాడమి
యువ శాస్త్రవేత్త, ఆంధ్ర ప్రదేశ్ అకాడమి ఆఫ్ సైన్సెస్
మేటీరియల్ రిసర్చ్ సంస్థ పతకం
ఫెల్లో, ఆంధ్ర ప్రదేశ్ అకాడమి ఆఫ్ సైన్సెస్
సంపాదకుడు, జర్నల్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సొసైటి ఆఫ్ ఇండియా
ఉపాధ్యక్షులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ స్ట్రక్చర్స్ అండ్ సిస్టంస్
సి ఈ ఓ, సొసైటీ ఆఫ్ ఇన్నొవేషన్ అండ్ డెవలప్మెంట్, ఐ ఐ ఎస్ సి
సంచాలకులు, సి ఎస్ ఐ ఓ
ఫెల్లో, ఐ ఈ టి ఈ
అధ్యక్షుడు, ఇన్స్ట్రుమెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా
కార్యదర్శి, లేజర్ సొసైటీ ఆఫ్ ఇండియా
సభ్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్
ఆచర్య మోహన్ నానో టెక్నాలజీ క్షేత్ర నిపుణుడిగా, మేటి శాస్త్రవేత్తగా మంచి పేరు గడించారు. రానున్న కాలంలో మరిన్ని ఆవిష్కరణలు చేసి భారత దేశ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేయాలని ఆశిద్దాము