కవితా స్రవంతి
మరలి రా... మా కోసం
- నిమ్మగడ్డ రామకృష్ణ

వసంతమా ...ఎక్కడ నీవు ... ?
ఎన్నాళ్ళని దాగుంటావు ...?

పండిపోయి రాలిన ఆశల ఆకుల్లో
మోడువారి ఎండిన హృదయపు కొమ్మల్లో
తిరిగిరాని గువ్వ కట్టుకొన్న గూటి ప్రతీక్షణల్లో
దినకరుని కాంతులను కప్పి మసకేసిన మబ్బుల్లో
ఘనీభవించిన జలపాతం మరచిన మృదంగధ్వనుల్లో
ఎక్కడ దాగున్నావో,

మరలి రా... మా కోసం...

ప్రకృతి లోని అణువణువూ వేచి ఉంది
తరిగిపోయిన చైతన్యపు సిరుల కోసం

మామిడి కొమ్మా , వేప రెమ్మా , కోయిల పాటా
తెగ వెదికే తిరిగిరాని నీకోసం
కళకళ లాడిన వనమంతా దిగాలు పడె
స్నేహపు విరుల పలకరింతల కోసం
ఖాళీగా మారిన ఆటస్థలం బిగువుగా చూచే
తనను వీడిన పిల్లల కేరింతల కోసం

మరలి రా... మా కోసం...

నీవు లేక కొందరికైతే బాగుందిలే...
గడ గడ వణికించే చలితో చెలిమి చేసి
రహదారులు మంచు దుప్పట్లు కప్పుకొని నిద్దరోతున్నాయి
వేసవిలో అలుపెరుగక తిరిగిన
శీతల యంత్రాలు చేతులు ముడుచుకొని కూర్చున్నాయి

వీళ్ళెవరూ, నిన్నేమీ అనరు. ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పటిలా

మరలి రా... మా కోసం...


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)