రసమయం ఈ ప్రపంచం
అసమానం దాని స్వరూపం
ఎటుచూచినా కనబడే విలాసానికి
చకితమైపోతుంది హృదయం
ఒక్కొక్క అణువులో
ఒక్కొక్క వర్ణం
దిక్కులదాకా ప్రకృతి సంపూర్ణం
గడ్డిపోచనూ వదలని సొగసు
ఘనమైన పర్వతాలనూ వదలని సోయగం
మంచుబిందువులనుండి
మహాసముద్రాలదాకా
మారని సృష్టిచిత్రం
ఆహా! విధాతా! నీ రచనం
ఆహ్లాదతాప్రచురం
విశ్వానికొక నమస్సు!
దాని విశిష్టతకొక మహస్సు !!
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)
|
|
గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)