సుజననీయం
మన తెలుగు సాహిత్యం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చెన్నాప్రగడ కృష్ణ

మన భాష - మన కర్తవ్యం

ఫిబ్రవరి 21న ప్రపంచమంతా మాతృభాషా దినోత్సవం జరుపుకొంది. 2003 సంవత్సరంలో యునెస్కో నిర్వహించిన సర్వేలో అంతరించబోయే భాషల్లో తెలుగు కూడా ఉందని పేర్కొంది. అయితే, పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి మెరుగుపడిందని ఆశిద్దాం. యునెస్కో మరొక్కసారి సర్వే జరిపి ఆ తీపి వార్తను మన చెవిన పడేస్తే బాగుంటుంది.

మరి తెలుగుభాష వాడుకను పెంపొందించటానికి మనమేం చేయాలి. పాఠశాలల్లో తెలుగును ప్రోత్సాహించాలి. తెలుగు సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలను, కళాకారులకు సహాయం అందించాలి. ప్రతి గ్రామంలో గ్రంథాలయాలని స్థాపించాలి. టీవీ, సినిమా మాధ్యమాల్లో తెలుగు వాడుకను పఠిష్ట పరచాలి. ప్రభుత్వపాలన తెలుగులో జరగాలి. ఈ విషయాలన్ని ఇప్పుడూ కొత్తగా ఏమీ చెప్పుకోవడం లేదు.

మరొక్కసారి మననం చేసుకుంటూ ఆచరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం.

ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి పిల్లలు తెలుగుబాషను నేర్చుకోవటానికి చేస్స్తున్న కృషిని, తెలుగు సంస్కృతిని ప్రదర్శించటానికి కనబరుస్తున్న ఆసక్తిని మనమంతా అభినందించాలి. 'పిల్లల పండుగ ' పేరిట మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపిన తీరు కడు శ్లాఘనీయం. మరిన్ని వివరాలు మనబడి శీర్షికలో చదవండి.

- తాటిపాముల మృత్యుంజయుడు

ప్రధాన సంపాదకులు, సుజనరంజని

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)